Chirala-Perala: ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నేతృత్వంలో నిర్వహించిన ‘చీరాల-పేరాల’ ఉద్యమం స్వాతంత్య్ర సంగ్రామంలో మహోజ్వల ఘట్టంగా నిలిచిందని కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల బాధ్యుడు, ఏఐసీసీ కార్యదర్శి మెయ్యప్పన్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన చీరాల, బాపట్లలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం శత జయంత్యుత్సవ సభను చీరాల పట్టణంలోని గోపాలకృష్ణయ్య పార్కు వద్ద నిర్వహించనున్నట్లు చెప్పారు. సాయంత్రం పాదయాత్ర, బహిరంగ సభ ఉంటాయన్నారు.
పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్, భాజపా నేతలు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనలేదన్నారు. చరిత్రను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చీరాల-పేరాల ఉద్యమానికి అంతర్జాతీయ గుర్తింపు ఉందన్నారు. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ.. శత జయంత్యుత్సవ కార్యక్రమానికి పార్టీలకతీతంగా అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌రతన్, బాపట్ల జిల్లా అధ్యక్షుడు గంటా అంజిబాబు, నాయకులు అందె నరసింహారావు, అలీంబాబు, పుష్పరాజ్, సురేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Water Problem : పలు పట్టణాల్లో నీటి కొరత... దాహం తీరే దారేదీ?