RAINS: అన్నమయ్య జిల్లాలో భారీ ఈదురు గాలులు, అకాల వర్షం దెబ్బకు... ఉద్యాన పంటలకు భారీగా నష్టం జరిగింది. సుమారు రెండు గంటలపాటు వీచిన గాలుల తీవ్రతకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. జిల్లాలో విస్తారంగా ఉన్న మామిడి తోటలపై గాలులు తీవ్ర ప్రభావం చూపాయి. కోత దశలో ఉన్న సమయంలో.. తుపాన్ వల్ల మామిడి కాయలు నేల రాలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరటి, నిమ్మ వంటి తోటలు కూడా భారీగా దెబ్బతిన్నాయని రైతన్నలు వాపోతున్నారు. రాయచోటి, రామాపురం, లక్కిరెడ్డిపల్లి, గాలివీడు, తదితర మండలాల్లో.. అత్యధిక నష్టం జరిగింది. పంట నష్టం జరిగిన గ్రామాల్లో.. ఉద్యాన శాఖ అధికారులు పర్యటించి.. నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వారం రోజుల్లో నాలుగుసార్లు ఈదురు గాలులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: 41 ఏళ్ల వయసులో హీరోయిన్ ప్రెగ్నెంట్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్!