Idhem karma Rastraniki Program : అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ చేపట్టిన ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని వైసీపీ నేతలు రెండో రోజూ అడ్డుకున్నారు. టీడీపీ నాయకుడు కోండిరెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించడానికి వస్తుండగా.. కురబలకోట మండలం ఎగువపోంగు వారి పల్లెలో వైసీపీ నేతలు అడ్డుకున్నారు. కార్యక్రమానికి వెళ్తున్న టీడీపీ కార్యకర్తలపై రాళ్ళదాడి చేశారు. వైసీపీ శ్రేణుల రాళ్ళదాడిని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణతో ఎగువపోంగు వారి పల్లెలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
గురువారం టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ శంకరయాదవ్ కార్యక్రమం నిర్వహించకుండా అడ్డుకున్న వైసీపీ శ్రేణులు.. శుక్రవారం కోండిరెడ్డిని అడ్డుకోవడంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి