CBN REVIEW MEETING: రాయచోటి లోక్‌సభ పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో.. తెలుగుదేశం అధినేత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శంకర్ యాదవ్కు వ్యతిరేకంగా.. కొందరు నినాదాలు చేశారు. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షలో ఇరు వర్గాల మధ్య.. ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. సభావేదికపై ఒక వర్గాన్ని మరొక వర్గం అడ్డుకుంది. బోయకొండ గంగమ్మ ఆలయ మాజీ ఛైర్మన్ రమణా రెడ్డిని వేదికపైకి వెళ్లకుండా.. పుంగనూరు ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ఇరువర్గాలు పరస్పరం వాగ్వాదానికి దిగారు. కార్యకర్తల బాహాబాహీపై.. చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఆయా నియోజకవర్గాల్లో.. పార్టీ నాయకత్వ నిర్ణయానికి అనుగుణంగా కార్యకర్తలు పనిచేయాలని ఆదేశించారు.
కడప లోక్‌సభ అభ్యర్థిగా శ్రీనివాసుల రెడ్డి, రాజంపేట లోక్‌సభ అభ్యర్థిగా గంటా నరహరి పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు. అధినేత ఆదేశానుసారం పార్టీ విజయానికి కృషి చేస్తామని నేతలు అన్నారు. సమీక్షల అనంతరం కలికిరి నుంచి..రోడ్డు మార్గాన రేణిగుంటకు చేరుకున్న చంద్రబాబు రాత్రి అక్కడే బస చేశారు. నేడు నగరి, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల పరిధిలోని కార్వేటిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొంటారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు 30 యాక్ట్ అమలు చేశారంటూ.. నేతలు ఆరోపించారు.
ఇవీ చదవండి: