ETV Bharat / state

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి కోసం.. ప్రతిపక్షాలు నోరు మెదిపితే తప్పుడు కేసులు : బీవీ రాఘవులు - బీజేపీ ప్రభుత్వం

BV Raghavulu Fires : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తోంది ప్రజల కోసమా లేక కోటీశ్వరుల కోసమా అని సీపీఎం పొలిట్​ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నోరు మెదిపితే చాలు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు.

BV Raghavulu
బీవీ రాఘవులు
author img

By

Published : Mar 21, 2023, 12:55 PM IST

BV Raghavulu On union and State Governments : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపన్నులు, అవినీతిపరులకు అండగా నిలుస్తున్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ.. అదానీ లాంటి కుబేరులను కాపాడుతోందని విమర్శించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించే వారిపై సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. కేంద్ర పెద్దల అవినీతిని తేల్చేందుకు జేపీసీని ఏర్పాటు చేయకపోవడం వెనక.. ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్​లో ఉద్యోగులు కార్మికులు, కర్షకులే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని జగన్​మోహన్​ రెడ్డి ప్రభుత్వం కేసుల పేరుతో విపక్ష పార్టీలు, ఉద్యోగులపై ఆక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పద్దతిని మార్చుకొని ప్రజలకు మేలు కలిగేలా వ్యవహరించాలని రాఘవులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఎవరైనా విమర్శిస్తున్నారంటే, నిరసన చేస్తున్నారంటే, ఏదైనా సమస్య ఉందని పోరాటం చేస్తుంటే రోడ్ల మీద రానివ్వరని దుయ్య బట్టారు. వచ్చిన వారిని అరెస్టులు చేస్తున్నారని వాపోయారు. అరెస్టులు చేసి అదుపులోకి తీసుకుని సాయంత్రం వరకు బయటకు రానివ్వరని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు పాతరైపోతున్నాయని. విమర్శలను సహించే పరిస్థితి లేదని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి విలువనిచ్చి, హక్కులకు విలువనిచ్చేలా ఇక్కడ వైఎస్సార్​సీపీ ప్రభుత్వం పాలను కొనసాగించాలని కోరారు.

కోటీశ్వరులు, సంపన్నులు ఏం తప్పులు చేసినా విచారణ ఉండదని.. ప్రతిపక్షాల నుంచి చిన్నగా ఎదైనా అయ్యిందంటే సీబీఐ వాళ్లు వస్తారని మండిపడ్డారు. రాజకీయ నాయకులు విమర్శలు చేస్తే వారి ఇంటికి ఇన్​కమ్​ టాక్స్​ అధికారులు వస్తారన్నారు. ఎవరైనా బీజేపీ మంచిది కాదని అంటే ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ వస్తుందని ఎద్దెవా చేశారు. ప్రతిపక్షం నుంచి ఏ చిన్న ఆరోపణ వచ్చిన అందరూ.. గద్దల లాగా వాలి వేధించటానికి సిద్ధంగా ఉన్నారని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వాలు ఎవరిని కాపాడటానికి ఉన్నాయని ప్రశ్నించారు. మోసలకు పాల్పడి ప్రజల సొమ్మును కాజేసే వారిని కాపాడేందుకు ఉందా.. లేక ప్రజలను రక్షించటానికి ఉందా అనేది ప్రశ్నార్థకంగా ఉందన్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.