ETV Bharat / state

దొంగల ముఠా అరెస్టు.. 26 బైక్​లు స్వాధీనం - బైక్​ల దొంగల ముఠా అరెస్టు

Bike Robbers Arrest: వారి విలాసాలకు ద్విచక్ర వాహనాల దొంగతనాలనే ఆసరాగా చేసుకున్నారు. లక్షలు విలువ చేసే ద్విచక్ర వాహనాలను దొంగిలించి.. వాటిని విక్రయించే ముఠాను అన్నమయ్య జిల్లా మదనపల్లి పోలీసులు అరెస్టు చేశారు . నిందితుల వద్ద నుంచి 26 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

దొంగల ముఠా అరెస్టు
దొంగల ముఠా అరెస్టు
author img

By

Published : Jun 21, 2022, 6:57 PM IST

విలాసాల కోసం ద్విచక్రవాహనాలు చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అన్నమయ్య జిల్లా మదనపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి 26 ద్వి చక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మదనపల్లి మండలం ఇసుకనూతిపల్లెకు చెందిన పి. హేమంత్ కుమార్, గొల్లపల్లికి చెందిన ఉప్పు అనిల్ కుమార్, కొత్తకోట మండలం గట్టు గ్రామానికి చెందిన చాకలి శ్రీనివాస్​గా గుర్తించారు.

నిందితులంతా చెడు వ్యసనాలకు అలవాటు పడి కర్ణాటక, చిత్తూరు, మదనపల్లె, బి. కొత్తకోట తదితర ప్రాంతల్లో దిచక్రవాహనాలు దొంగతనం చేసేవారని మదనపల్లి డీఎస్పీ రవికుమార్ తెలిపారు. అనంతరం వాటికి నకిలీ ఆర్​సీ తయారు చేసి తక్కువ ధరకు విక్రయించేవారన్నారు. వీరిని ఈ నెల 20వ తేదీన మదనపల్లిలోని ఎస్టేట్ జంక్షన్ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిపైన ఇప్పటివరకు 14 కేసులు నమోదయ్యాయన్నారు. ఇంకా 12 కేసులకు సంబంధించి ప్రాపర్టీ రికవరీ చేయాల్సి ఉందని డీఎస్పీ రవికుమార్ తెలిపారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.