రాష్ట్రవ్యాప్తంగా రబీస్ డే, జునోసిస్ డే సందర్భంగా పలు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ టీకాలు వేశారు. జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వారం రోజులపాటు ఈ టీకాలు వేయనున్నట్లు అధికారులు తెలిపారు.
గుంటూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ కారణంగా పెంపుడు కుక్కల వ్యాక్సిన్ కార్యక్రమాలకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి పెంపుడు కుక్కలకు రోజూ పరిమిత సంఖ్యలో వ్యాక్సిన్ వేయించుకుని వెళ్లేలా అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే తరహాలో యాంటీ రేబిస్ టీకాలు వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేబిస్‌ను నియంత్రించే క్రమంలో కుక్కలు, పిల్లులకు ఏటా టీకాలు వేస్తున్నట్లు అధికారులు వివరించారు. పెంపుడు జంతువులు ఉన్న వారంతా వాటికి తప్పకుండా వ్యాక్సినేషన్ చేయించాలని సూచిస్తున్నారు.
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఉచిత రేబిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. స్వయంగా కుక్కలకు వ్యాక్సిన్ వేశారు. పశు వైద్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన గదిని ప్రారంభిచారు. కరోనా వైరస్ కారణంగా జిల్లాలో వ్యాక్సిన్ చేసే విధానంలో కొన్ని మార్పులు చేశారు.
ఇదీ చదవండి: గుంటూరు మిర్చి యార్డులో కార్యకలాపాలు పునఃప్రారంభం