ETV Bharat / state

ఎగతాళి చేస్తున్నారు: కొబ్బరికాయలు కొట్టడమేనా..! పనులు ఏమైనా చేసేదుందా..!

author img

By

Published : Mar 28, 2023, 8:14 PM IST

Ananthapuram Municipal Corporation : అనంతపురం నగరపాలక సంస్థ కౌన్సిల్​ సమావేశాలు హాట్ హాటా గా కొనసాగుతున్నాయి. సమావేశాల్లో వైసీపీ కార్పొరేటర్లే సమస్యలపై తమ గళాన్ని వినిపిస్తున్నారు. అభివృద్ధి పనులకు కొబ్బరి కాయలు కొట్టడమేనా.. అంటూ, ప్రజలు ఎగతాళి చేస్తున్నారని వైసీపీ కార్పొరేటర్లు మొర పెట్టుకున్నారు.

వైసీపీ కార్పొరేటర్లు

Ananthapuram Municipal Corporation : అనంతపురం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం సోమవారం రసాభాసగా సాగింది. అధికార వైసీపీ పార్టీ సభ్యులే విపక్ష సభ్యులుగా మారి సమస్యలపై తమ గళం వినిపించారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో సమస్యలు పరిష్కారం కాలేదంటూ నిరసన చేపట్టారు. అనంతపురంలోని సెంట్రల్ పార్క్ స్థలం అన్యాక్రాంతం అవుతోందంటూ కౌన్సిల్​ హాల్లో నేలపై కూర్చొని 7వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ నాగమణి నిరసన తెలిపారు. దీంతో సమావేశంలోని తోటి కార్పొరేటర్లు ఆమెకు మద్దతు తెలిపారు.

తాము టీ లు, బిస్కెట్లు తాగడానికి వచ్చామా..! తీర్మానాలు, పరిష్కారాలు లేని సమావేశాలు ఎందుకంటూ.. పలువురు కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సొంత పార్టీ కార్పొరేటర్లను సర్ది చెప్పేందుకు మేయర్ వసీం చాలా శ్రమించాల్సి వచ్చింది. ఆయనే స్వయంగా వచ్చి నేలపై కూర్చున్న కార్పొరేటర్లను శాంతింపజేసే తీవ్ర ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది అధికారులు ముడుపులు చెల్లిస్తే గాని పనులు చేయడం లేదంటూ కార్పొరేటర్లు ఆరోపించారు. అధికారుల పనితీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కౌన్సిల్ సమావేశాల్లో 12వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్​ బాబా ఫక్రుద్దీన్​.. చేసిన ప్రసంగం స్థానికంగా వైరల్ గా మారింది. తన డివిజన్ పరిధిలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి, పనులు చేయకకపోవడంపై.. ప్రజలు తనను ఎద్దేవా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో జరిగిన సమావేశాల్లో సుమారు 18 సమస్యలను వివరించానని.. ఇప్పటి వరకు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని ఆయన తెలిపారు. ఈ సమావేశాల్లో 9 సమస్యలను నివేదించానని ఫక్రుద్దీన్ పేర్కొన్నారు. ఈ సమస్యలను కూడా పరిష్కరించకపోతే.. వచ్చే సమావేశాల నుంచి తాను పాల్గొననని చెప్పాడు. తాను వివరించిన సమస్యలను అధికారులు పరిష్కరించకపోతే ఇకపై సమావేశాలకు రాకుండా ఉండటం మేలని అన్నారు. కౌన్సిల్​ సమావేశాన్ని సినిమా హాల్​లాగా పరిగణించకుండా.. ప్రతి విషయాన్ని సీరియస్​గా తీసుకుని సమస్యలను పరిష్కరించాలని మేయర్​ ముందు తన ఆవేదన బయట పెట్టారు. ప్రతి సమావేశంలో సమస్యలను సమావేశంలో ప్రస్తావించటం.. మాటలతో సరిపెట్టటం ఇంతే సరిపోతోందని అన్నారు. అంతే తప్పా సమస్యలకు దారి చూపటంలో అధికారులు చొరవ చూపటం లేదన్నారు.

వైసీపీ కార్పొరేటర్లు నిరసన

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.