ETV Bharat / state

గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో అరుదైన ప్రసవం.. 5.8 కిలోల శిశువు జననం - Anantapur News

woman gave birth to a 5.8 kg baby boy: సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు బరువు 2.5 కేజీల నుంచి 3.5 ఉంటుంది.. ఓ మహిళ 5.8 కేజీల బాలుడి జన్మనిచ్చింది.. అది కూడా అతి కష్టం మీద సహజ ప్రసవం ద్వారా.. ఇంతకీ ఇది ఎక్కడా అనుకుంటున్నారా.. ఎక్కడో కాదు.. మన రాష్ట్రంలోనే.. ప్రస్తుతం ఆ తల్లి బిడ్డ క్షేమం అని ఆసుపత్రి వైద్య సిబ్బంది తెలిపారు. పూర్తి ఆరోగ్యంతో పుట్టిన శిశువుని చూసి ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు. అంత కష్టపడి.. ప్రసవం చేసిన వైద్య సిబ్బందికి ఆ దంపతులు ధన్యవాదాలు తెలిపారు.

woman gave birth to a 5 kg baby boy
woman gave birth to a 5 kg baby boy
author img

By

Published : Feb 12, 2023, 1:08 PM IST

ప్రభుత్వాసుపత్రిలో అరుదైన ప్రసవం.. 5.8 కిలోల బరువున్న శిశువుకు జన్మనిచ్చిన మహిళ

Woman gave birth to a 5.8 kg baby boy: ప్రభుత్వాసుపత్రి అంటేనే సమస్యలకు నిలయమని భావించే ఈ రోజుల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వాసుపత్రి అరుదైన ఘటనకు వేదికగా నిలిచింది. కర్నూలు జిల్లా హత్తిబేలాగాలుకు చెందిన తేజస్విని అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో సమీపంలోని ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె స్థితిని గమనించిన వైద్యులు గుంతకల్లుకు గాని బళ్ళారి, కర్నూలు ప్రాంతంలోని ఆసుపత్రులకు వెళ్లాలని సూచించడంతో, వారు గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు.

అప్పటికే పురిటి నొప్పులతో బాధపడుతున్న తేజస్వినికి ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు సుజాత ధైర్యాన్ని చెప్పి తప్పకుండా.. సహజ ప్రసవం ద్వారా కాన్పు అయ్యేలా చేస్తామని ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. దాదాపుగా రెండు గంటల శ్రమ అనంతరం సహజ ప్రసవం అయ్యేలా చేశారు. అయితే మూడు మూడున్నర కేజీల వరకూ.. బరువు ఉన్న శిశువు సహజ ప్రసవం అవ్వడానికి అవకాశం ఉందని.. కానీ పుట్టిన శిశువు ఏకంగా 5.8 కేజీల బరువుతో పుట్టడం.. అది కూడా సహజ ప్రసవం ద్వారా పుట్టడం అనేది.. అరుదుగా జరుగుతుందని తెలిపారు.

అధిక బరువు ఉన్న శిశువులను సహజ ప్రసవం ద్వారా ప్రసవం చేయడం చాలా కష్టమైన పని అని.. గుంతకల్లు ప్రభుత్వ డాక్టర్లు, వైద్య సిబ్బంది, అందరూ కలిసి శ్రమించి తమకు సహకారం అందించడం చాలా ఆనందంగా ఉందని దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. తేజస్విని భర్త నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చాలా అద్భుతంగా ఉందని.. డాక్టర్లు పూర్తి సహాయ సహకారాలు అందించారని.. ప్రతి ఒక్కరు ప్రభుత్వాసుపత్రికే వచ్చి వైద్యం చేయించుకోవాలని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.