ETV Bharat / state

ప్రియుడి మోజులో పడి.. భర్తను పొట్టనపెట్టుకుంది!

ప్రియుడి మోజులో పడి భర్తనే కాదనుకుంది ఓ భార్య. ప్రియుడితో కలసి హత్య చేయాలని పథకం పన్నింది. పక్కా ప్లాన్ ప్రకారం భర్తను చంపేసింది. ఆఖరికి.. ఆ హత్యను ప్రమాదంగా చిత్రీకరించింది.

wife murdered her husband with her lover at  thadipathri at ananthapuram

author img

By

Published : Mar 19, 2020, 11:20 PM IST

ప్రియుడి మోజులో పడి భర్తనే చంపేసింది!

ప్రియుడి కోసం భర్తను.. భార్య దారుణంగా చంపేసింది. పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని నందలపాడు కాలనీకి చెందిన శేఖర్ శుద్ధ జలాన్ని ఆటోలో అమ్ముతూ జీవనం సాగించేవాడు. శేఖర్​కి భార్య నాగమ్మ, ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. నాగమ్మ గత ఐదేళ్లుగా సమీప బంధువు బలరాంతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించేది. నెల రోజుల క్రితం శేఖర్​కి అనుమానం రాగా... భార్యను, బలరాంను మందలించాడు. తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న భర్తను చంపేయాలని ప్రియుడితో కలిసి పథకం వేసింది నాగమ్మ.

అవులతిప్పాయి పల్లి సమీపంలో ఉన్న పెద్దమ్మ గుడికి వెళ్దామంటూ భర్తతో బుధవారం తెల్ల వారుజామున ద్విచక్ర వాహనంపై వెళ్లింది. గ్రామ సమీపంలోకి వెళ్లగానే భర్తని రహదారి పక్కన ఆపమంది. వెనక ఆటోలో వెళ్లిన ప్రియుడు .. క్రికెట్ బ్యాట్​తో శేఖర్​ తలపై దాడి చేయగా..​ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులకు అనుమానం రాకుండా ద్విచక్ర వాహనాన్ని కింద పడేశారు. ఎవరైనా చూస్తే.. రోడ్డు ప్రమాదంలో మృతిచెంది ఉంటాడని అనుకునేలా చిత్రికరించారు. అక్కడి నుంచి ఇద్దరూ ఆటోలో పరారయ్యారు.

వ్యక్తి చనిపోయాడని తెలుసుకున్న గ్రామీణ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజశేఖర్ రెడ్డి ఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించారు. నెత్తుటి మరకలు ఉన్న ఓ బ్యాట్ ముక్క వారికి కనిపించింది. ద్విచక్ర వాహనాన్ని చూస్తే ప్రమాదంలో చనిపోలేదని అనుమానం వచ్చింది. శేఖర్​ అక్క ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా.. కేసు నమోదు చేసుకుని విచారణ చేశారు. ఒక్క రోజులోనే కేసును చేధించి గుట్టును రట్టు చేశారు.

ఇదీ చదవండి:

ఆస్తి కోసం సొంత సోదరుడిని హత్య చేసిన అన్నదమ్ములు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.