ETV Bharat / state

నీటి పొదుపు పాటించకుంటే ప్రమాదమే.. ! - special story on ground water

మన దేశంలో నీరులేక అల్లాడుతున్న ప్రాంతాలు అనేకం. 2050 నాటికి ప్రపంచంలో నీటి సంక్షోభం తలెత్తే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. సకాలంలో మేల్కొని తక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో నీరు వినియోగ వస్తువుగా మారే పరిస్థితులు రావొచ్చని వారు హెచ్చరిస్తున్నారు. అనంతపురం జిల్లాలో నైరుతి, ఈశాన్య రుతు పవనాల ప్రభావం వల్ల కురిసిన వర్షం నీటిని జాగ్రత్తగా వాడుకుంటే భవిష్యత్తులో జలగండం తప్పుతుందని అంటున్నారు.

water saving
నీటి పొదుపు పాటించకుంటే ప్రమాదమే
author img

By

Published : Jan 18, 2021, 5:33 PM IST

నీరు లేనిదే ప్రాణం లేదు. పంటలు, పరిశ్రమల్లేవు. కానీ ఆ నీరు అన్నిచోట్లా ఉండదు. ప్రకృతి ఇస్తే తప్ప మరో రకంగా పొందలేని ఈ నీటిని ఇష్టానుసారం వాడేస్తున్నాం. మన ఇంట్లోని కొళాయిలో నీళ్లు దండిగా వస్తున్నాయి కదా.. మనకు నీటి సమస్య లేదనే అతి నమ్మకం వీడాలి. ఏటా నీటి కొరత మరింత తీవ్రతరం అవుతోంది. అందుబాటులో ఉన్న నీటి వనరులను ఎంత సమర్థవంతంగా వినియోగించుకోవాలన్న అంశంపై ప్రభుత్వాలు, ప్రజలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో నైరుతి, ఈశాన్య రుతు పవనాల ప్రభావం వల్ల కురిసిన వర్షం నీటిని జాగ్రత్తగా వాడుకుంటే భవిష్యత్తులో జలగండం తప్పుతుంది.

  • పదేళ్ల తర్వాత పుష్కలంగా..

అనంతపురం జిల్లా భౌగోళికంగా వర్షాఛాయ ప్రాంతంలో ఉంది. రుతుపవనాలు కేరళ వైపు నుంచి జిల్లాలోకి ప్రవేశించే క్రమంలో కర్ణాటకలోని పశ్చిమ కనుమలు అడ్డుకుంటాయి. అక్కడ అధిక వర్షం కురుస్తుంది. ఆ తర్వాత జిల్లాలోకి ప్రవేశించే గాలులు బలహీనపడి తక్కువ వర్షపాతం నమోదవుతుంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాలు, తుపానుల వల్ల చెప్పుకోదగ్గ వానలు పడతాయి. 2020 మే నుంచి డిసెంబరు వరకు జిల్లాలో 747.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాస్తవానికి డిసెంబరు నాటికి సగటు వర్షపాతం 493.9 మిల్లీమీటర్లు. అంటే 51.3శాతం అదనంగా వర్షం కురిసింది. ఈ క్రమంలో మే-2020లో సగటున 23.06 మీటర్ల లోతులో ఉన్న నీటిమట్టాలు, డిసెంబరు-2020 నాటికి 11.20 మీటర్లుపైకి ఎగబాకాయి. మే నుంచి డిసెంబరు వరకు జిల్లాలో భూగర్భజలాలు 11.86 మీటర్లు పెరిగాయి. ఇలా పెరగడం పదేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం.

  • అనంత నేలపై 504.93 టీఎంసీలు

గతేడాది ఖరీఫ్, రబీ సీజన్‌లో అధిక వానలు కురిశాయి. దీంతో డిసెంబరు-2020 నాటికి 504.93 టీఎంసీల వర్షంనీరు అనంత నేలపై పడింది. ఇందులో 60.59 టీఎంసీలు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలుగా మారాయి. బావులు, బోర్లలో నీటిమట్టాలు పెరిగాయి. ఫలితంగా జిల్లాలో నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ప్రాంతాల సంఖ్య గణనీయంగా తగ్గింది. వేసవిలో ఎండుముఖం పట్టిన బోర్లలో ప్రస్తుతం జలం పుష్కలంగా లభ్యమవుతోంది. యల్లనూరు మండలం పాతపల్లి ఫీజోమీటరులో అతి తక్కువగా 0.12 మీటర్ల లోతులో నీరు లభిస్తోంది. 63 మండలాల్లో 46 మండలాలు సురక్షిత స్థాయిలో ఉన్నాయి.

మేలుకొందాం.. జలాలను ఒడిసిపడదాం

  • రైతులు తక్కువ నీటితో ఎక్కువ పంటలు, అధిక ఆదాయాన్ని ఇచ్చే వంగడాలను సాగు చేయాలి.
  • 3 నుంచి 5వేల లీటర్ల నీటిని వినియోగించే వరిని విడనాడాలి. అంతకంటే తక్కువ నీటితో అధిక దిగుబడి ఇచ్చే రకాలను నాటాలి.
  • మెట్టభూమి రైతులు ఉద్యాన పంటలకు మళ్లాలి. బిందు, తుంపర పరికరాలను వినియోగించాలి.
  • రక్షిత మంచినీటి పథకాల నుంచి సరఫరా అయ్యే నీరు వృథా కాకుండా నివారణ చర్యలు చేపట్టాలి.
  • గృహ, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థపు నీటిని పునర్వినియోగానికి అనువుగా మార్చుకోవాలి.
  • వాహనాలు, దుస్తులు శుభ్రం చేసే సమయంలో నీటిని పొదుపుగా వాడాలి.
  • వర్షపు నీటిని ఎక్కడికక్కడ ఆపాలి. ఆపిన ప్రతినీటి బొట్టును భూమిలోకి ఇంకేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
  • చెక్‌డ్యాంలు, పర్క్యులేషన్‌ ట్యాంకులు, నీటికుంటల నిర్మాణాలు విరివిగా చేపట్టాలి.
  • గొట్టపు బావుల పంపుసెట్లకు మీటర్లు బిగించాలి. అందుకు వినియోగ ఛార్జీలు వసూలు చేస్తే కొద్దివరకైనా నీటి వినియోగంపై నియంత్రణ సాధించవచ్చు.
  • అవసరానికి మించి తోడేస్తున్నారు

అనంతలో ఏటా నీటి కొరత తలెత్తుతోంది. భూ విస్తీర్ణం ఎక్కువగా ఉండటం, వర్షాఛాయ ప్రాంతంలో ఉండటం కారణంగా వానలు ఆశించిన స్థాయిలో కురవక సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దశాబ్ద కాలంలో జిల్లాకు హంద్రీనీవా ద్వారా జలాశయాలను నింపుతుండటంతో సమస్య కాస్త తగ్గింది. ఒక్కో సందర్భంలో బిందె నీటి కోసం మైళ్లు నడవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం భూగర్భ జలాలను ఇబ్బడిముబ్బడిగా తోడేయ్యడమే. మరోవైపు జిల్లాలో ఇటీవల మెట్ట భూములను సాగులోకి తీసుకొస్తున్నారు.
ఉద్యాన, గింజ పంటలను పండిస్తున్నారు. వాటి సాగుకు అధిక నీటిని బోర్ల ద్వారా భూగర్భం నుంచి లాగేస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ బోర్లు 2,72,607, తాగునీటి బోర్లు 5,750 ఉన్నాయి. అలాగే గృహ వినియోగ బోర్ల ద్వారా నిరంతరం తోడుకుంటున్నాం. ఏడాదిలో సగటున 50 నుంచి 55 టీఎంసీలను వినియోగిస్తున్నాం. ఈ క్రమంలో నీటివృథా అధికం అవుతుంది. అవసరానికి మించి జలాన్ని పైకి లాగడం వల్ల ఎద్దడి ఏర్పడుతోంది.

ఇదీ చూడండి: 'సరైన వివరణ ఇవ్వకపోతే.. తగిన ఆదేశాలు ఇస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.