ETV Bharat / state

కరువు సీమలో జల ఉద్యమం..

కరవు జిల్లాలో నీటి లభ్యతే కష్టం... దొరికిన నీటిని పొదుపుగా వాడుకోవాలన్న బాధ్యత ఎంతమందిలో ఉంటుంది! ఆ సేవాసంస్థ మాత్రం ఈ విషయంలో ముందంజలో ఉంది. జల సంరక్షణే ధ్యేయంగా కరవు జిల్లాలో నీటి పొదుపును ఓ ఉద్యమంలా చేపట్టింది. మురుగునీటిని సైతం శుభ్రపరిచి మొక్కలకు ప్రాణం పోస్తోంది.

author img

By

Published : Jul 17, 2019, 9:25 AM IST

కరవు ప్రాంతంలో జల ఉద్యమం... అహ్లాద పరుస్తోంది ఉద్యానవనం

దేశంలోనే అత్యల్ప వర్షం కురిసే ప్రాంతాల్లో అనంతపురం జిల్లా రెండోస్థానంలో ఉంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని పెరిగే వేప, జమ్మి, రావి వంటి వృక్షాలూ నిలువునా ఎండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులున్నా... జల సంరక్షణ, పచ్చదనం కోసం అధికారులు తీసుకున్న చర్యలు శూన్యం. అనంతపురం జిల్లాలో నిరుపేదలను అక్కున చేర్చుకొని సేవలందిస్తున్న ఆర్డీటీ సంస్థ మాత్రం ముందుకొచ్చింది. నీటి పొదుపే కాదు మురుగునీటిని శుభ్రపరిచి మొక్కలు పెంచుతోంది.

ఆర్డీటీ సంస్థ చొరవతో...
బత్తలపల్లి మండల కేంద్రంలో 140 ఎకరాల్లో ఆర్డీటీ సంస్థకు చెందిన వైద్యశాల, విద్యాసంస్థలు, వసతి గృహాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న 7 బోరు బావుల నుంచి నీళ్లు రావడం తగ్గిపోయింది. ప్రమాదాన్ని పదేళ్ల క్రితమే గుర్తించిన ఆర్డీటీ సంస్థ మురుగునీటి పునర్వినియోగం ప్రారంభించింది.
బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రి నుంచి రోజూ వచ్చే 4లక్షల లీటర్ల మురుగునీటిని కొరియన్ టెక్నాలజీతో శుభ్రపరిచే విధానం ప్రారంభించారు. స్పెయిన్ పర్యావరణ ఇంజనీర్లను రప్పించి ఈ ప్రాజక్టు నిర్మించారు. మురుగునీటిని ఓ మూలకు చేరుస్తారు. తొలిదశలో అక్కడ శుద్ధి చేసి... వివిధ పరిమాణాల రాళ్లతో నింపిన ఆరు అడుగుల గుంతలోకి పంపిస్తారు. అక్కడి నుంచి 3 రకాల జమ్ము ఉన్న ప్రాంతంలోకి పంపిస్తారు. 90 శాతం మురుగు ఈ జమ్ము ఉన్న ప్రదేశంలో శుభ్రమవుతుంది. ఆ నీటిని ప్రత్యేక సంపులోకి మళ్లిస్తారు. అక్కడ యూవీ కిరణాలతో ప్రమాదకరమైన బ్యాక్టీరియా పోగొడతారు. తర్వాత మరోసారి శుద్ధి చేస్తారు.
రోజూ 4లక్షల లీటర్ల మురుగునీటిని శుభ్రం చేస్తారు. చుక్క వృథా పోకుండా 140 ఎకరాల్లో మొక్కలు పెంచుతున్నారు. ఆసుపత్రి ఆవరణాన్ని ఓ ఉద్యాన వనంలా మార్చేశారు. రోగులకు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్నిచ్చే మొక్కలతోపాటు అంతర్గత రోడ్లకు ఇరువైపులా కంచె మొక్కలు పెంచారు.

Gorakhpur (UP), July 16 (ANI): Uttar Pradesh's Chief Minister Yogi Adityanath is on a-day visit to his city Gorakhpur on Tuesday. On the occasion of 'Guru Purnima,' he offered prayers to his Guru Mahant Avaidyanath. Besides being the CM of Uttar Pradesh, he is also the 'Pithalishwar' (head) of Gorakhnath Math.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.