అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గొల్లపల్లి జలాశయం నుంచి.. హంద్రీనీవా కాలువ ద్వారా చెరువులకు నీటి విడుదల చేశారు. మండలంలోని హరిపురం సమీపంలో హంద్రీనీవా కాలువ నుంచి చిన్నప్పరెడ్డి పల్లి, మునిమడుగు గ్రామాల చెరువులకు నీటి విడుదల ప్రారంభించారు. హరిపురం సమీపంలో రైల్వే భూగర్భ పనులు జరుగుతుండటంతో.. నీరు నిల్వ అయ్యింది. దీంతో వంతెన కింద నుంచి ప్రయాణించటానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి.. రైల్వే వంతెన కింద నిల్వ నీటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఉయ్యాలోత్సవం