అనంతపురంలో ద్విచక్రవాహనాలను దొంగలించే ముఠా గుట్టు రట్టయ్యింది. నాల్గవ పట్టణ పోలీసులు.. ముఠాకు చెందిన ఓ దొందను అరెస్టు చేశారు. అతడిని మైనర్ గా గుర్తించి.. జువైనల్ బోర్డు ముందు హాజరు పరిచారు. అతడి నుంచి రూ. 7.59 లక్షల విలువ చేసే 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు చోరీలు చేసే మరో ఇద్దరు.. పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
అనంతపురం వన్‌టౌన్, టూ టౌన్, త్రీటౌన్, నాల్గవ పట్టణం, రూరల్, బుక్కరాయసముద్రం పోలీసు స్టేషన్ల పరిధిల్లో 20 ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పారు. ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు.. డీఎస్పీ వీరరాఘవరెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక నిఘా వేశారని తెలిపారు. తనిఖీలలో భాగంగా వచ్చిన సమాచారం మేరకు.. పరారీలో ఉన్న మిగతా ఇద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు.
ద్విచక్రవాహనాల రికవరీ
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు అనంతపురంలో మొత్తం 125 ద్విచక్రవాహనాలు దొంగతనం కాగా... వీటిలో 103 ద్విచక్ర వాహనాలు రికవరీ చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: