ETV Bharat / state

కొండప్రాంతంలో మహిళ హత్య.. - ananthapuram district latestnews

అనంతపురం జిల్లా పామిడి శివారులోని కొండప్రాంతాల్లో ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. ఆ మృతదేహం దుర్వాసన రావటంతో గొర్రెలకాపరులు గమనించి.. పోలీసులకు సమాచారం అందించారు.

Thugs kill a woman in the hills
కొండప్రాంతాల్లో ఓ మహిళను హతమార్చిన దుండగులు
author img

By

Published : Feb 24, 2021, 2:04 PM IST

అనంతపురం జిల్లా పామిడి శివారులోని కొండప్రాంతంలో ఓ మహిళను.. దుండగులు దారుణంగా హతమార్చారు. మృతదేహం దుర్వాసన రావడంతో అటుగా వెళ్తున్న గొర్రెలకాపరులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలికి 30 నుంచి 35 ఏళ్ల వయసుంటుందని.. అత్యాచారం చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్య మూడ్రోజుల క్రితం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: తిరుమల శ్రీవారికి స్వర్ణ శంఖుచక్రాలు బహూకరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.