అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం తండాలో... ఆంజనేయులు నాయక్ అనే రైతుకు చెందిన వేరుశెనుగ వామును గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. సుమారు రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లింది. ఇన్ని నెలలు కష్టపడి పండించిన పంట కాలిపోవటంతో రైతు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వమే తనను ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేశాడు.
ఇదీచదవండి