ETV Bharat / state

గుంతకల్లులో జంటహత్యలు... ఆస్తి వ్యవహారాలేనా..! - ఏపీ నేర వార్తలు

Murder In Guntakal Update: మంగళవారం గుంతకల్ జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. బుధవారం పోలీసులు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వంట మనిషి వాగ్మూలంతో తదుపరి విచారణ చేపట్టారు.

Guntaklu Janta Hatyala Nidhithulu
గుంతకల్ లో జంట హత్యలు
author img

By

Published : Feb 15, 2023, 4:56 PM IST

Updated : Feb 15, 2023, 10:49 PM IST

Murder In Guntakal Update: అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో మంగళవారం రాత్రి జరిగిన జంట హత్యలు జిల్లాలో సంచలనం సృష్టించాయి. హత్య జరిగిన ప్రదేశంలో హార్డ్ డిస్కులను సైతం హంతకులు దొంగలించడంతో పోలీసులు బుధవారం పరిసర ప్రాంతాలలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్​లను పరిశీలించారు. అనంతరం సీసీ కెమెరాలలో ఉన్న వ్యక్తులను ప్రత్యక్ష సాక్షి అయిన వంట మనిషి ఫహిద చూపించడంతో గుర్తు పట్టింది. దీంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాలలలో రికార్డు అయినటువంటి వ్యక్తులను పట్టుకోవడానికి తీవ్రమైన కృషి చేస్తున్నారు.

ఆస్తి తగాదా : గుంతకల్లులో జంట హత్యలు అందరినీ ఉలిక్కిపడేలా చేశాయి. దుండగులు ఇంట్లోకి చొరబడి ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. మాస్క్​లతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కోటిరెడ్డిని కలవడానికి వచ్చారు. వారు ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టమని బెదిరించారనీ, కోటిరెడ్డి నిరాకరించడంతో వారి వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణ రహితంగా ఒక్కసారిగా దాడి చేశారు. అడ్డువచ్చిన డ్రైవర్‌ షేక్‌షాను కూడా పొడిచారు. ఘటన జరిగిన సమయంలో డ్రైవర్‌ షేక్‌షా తల్లి అదే ఇంటిలో వంట గదిలో ఉన్నట్లు గుర్తించిన నిందితులు.. ఆమెను కూడా హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే, ఆమె వంటింటి తలుపులు వేసుకొని గట్టిగా అరవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయినట్టు తెలుస్తోంది.

విదేశాల నుంచి వచ్చిన భూస్వామి కోటిరెడ్డి: ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న ఇద్దరినీ చూసిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 15 రోజుల క్రితమే కోటిరెడ్డి విదేశాల నుంచి వచ్చారు. భూస్వామి కోటిరెడ్డి వద్దకు వచ్చిన వ్యక్తులే హత్య చేసినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. పాత గుంతకల్లు నుంచి రాము అనే వ్యక్తి పంపాడని వారు తెలిపారన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృత దేహలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భూస్వామి కోటిరెడ్డి హత్య చేయడానికి ఆస్తి వ్యవహారాలేమోనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి

Last Updated : Feb 15, 2023, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.