అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం పైపేడు గ్రామంలో తెల్లవారుజామున పిడుగుపాటు సంభవించింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన గోపాల్, నారాయణస్వామిలకు చెందిన రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈదురుగాలుల కారణంగా గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వారు ఆరుబయట నిద్రించారు. ఈ సమయంలో పిడుగుపడటంతో పెద్ద ఎత్తున మంటలు చేలరేగి రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు 10 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు వాపోయారు. పిడుగు ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి