పనిభారం ఒత్తిడి తట్టుకోలేక అనంతపురం జిల్లా గుంతకల్లులో ఓ ప్రధానోపాధ్యాయుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందిరానగర్‌లో నివాసం ఉండే.. కోదండ రామయ్యశెట్టి విడపనకల్లు మండలం హంచనహాల్లో ప్రధానోపాద్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఆయన గంతకల్లు రైల్వే జంక్షన్ వద్ద ట్రాక్‌పై శవమై కనిపించాడు.
గమనించిన రైల్వే పోలీసులు... కేసు నమోదు చేసి అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే తమకు ఎలాంటి సమస్యలు లేవని... ఈ మధ్య ప్రభుత్వం చేపట్టిన నాడు - నేడు పనుల ఒత్తిడి ఎక్కువగా ఉండేదని చెబుతుండేవాడని.... మృతుడి భార్య రాధ రత్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి జేబులో లభించిన సూసైడ్ నోట్లో ఏముందనేది పోలీసులు ఇంకా వెల్లడించలేదు.
ఇదీ చదవండి: