ETV Bharat / state

సేవల్లో ఆర్​బీకేలు విఫలం.. సరిదిద్దుకుంటున్న వ్యవసాయ శాఖ - సేవల్లో తప్పులను దిద్దుకుంటున్న రైతు భరోసా కేంద్రాలు

రైతు భరోసా కేంద్రాల్లో సేవల వైఫల్యం నుంచి వ్యవసాయశాఖ పాఠాలు నేర్చుకుంటోంది. గ్రామాల్లోనే ఏకగవాక్ష విధానంలో సేవలందించే ప్రతిపాదనతో ప్రారంభించిన ఆర్బీకేలు ఖరీఫ్ లో రైతులకు ఆశించిన మేర సేవలందించలేదు. ఇంటివద్దకే ఎరువులు ఇస్తామని చెప్పిన వ్యవసాయశాఖ, ఆర్బీకేలో డబ్బులు చెల్లించిన రైతులకువెనక్కు ఇచ్చింది. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు రైతులకు అందించే బాధ్యతను ఏపీ ఆగ్రోస్ కు అప్పగించిన అధికారులు ఆ సంస్థ వైఫల్యంగా తేల్చారు. రబీ నుంచి ఈ ఉత్పాదకాలన్నీ రైతులకు అందించటానికి మార్క్ ఫెడ్ కు అప్పగించారు. ఇక నుంచి రైతుభరోసా కేంద్రం వద్దనే గోదాములు నిర్మించి, అన్ని ఉత్పాదకాలు అక్కడే నిల్వచేయనున్నారు.

raithu bharosa centers rectify failures in services of farmers
వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న రైతు భరోసా కేంద్రాలు
author img

By

Published : Nov 25, 2020, 4:14 PM IST

Updated : Nov 25, 2020, 8:22 PM IST

రైతు భరోసా కేంద్రాల్లోని సేవల్లో వైఫల్యాలను సరిదిద్దటానికి వ్యవసాయశాఖ చర్యలు ఆరంభించింది. దేశంలో తొలిసారిగా గ్రామస్థాయిలో రైతులకు ఏకగవాక్ష విధానంలో సేవలందించే వ్యవస్థను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈసారి ఖరీఫ్ నుంచి పూర్తిస్థాయిలో సేవలందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం విఫలమైంది. అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనాలను మాత్రం గ్రామస్థాయిలో రైతులకు విజయవంతంగా పంపిణీ చేసింది. ఎరువులు, పురుగు మందులు, ఇతర విత్తనాల అమ్మకాల విషయంలో ఆర్బీకేలు పూర్తిగా విఫలమయ్యాయి. జిల్లాలో ఐదుచోట్ల ఎరువులు, పురుగు మందులు నిల్వచేసే కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఆర్బీకేలో ఎరువులు, పురుగు మందుల కోసం రైతులు డబ్బు చెల్లించిన 48 గంటల్లో వారికి ఆయా ఉత్పాదకాలు అందించాలనేది లక్ష్యం. కాని ఎరువుల హబ్ లు ఆర్బీకేలకు వంద కిలోమీటర్లకు పైగా దూరం ఉండటంతో డబ్బు చెల్లించిన చాలా మంది రైతులకు గ్రామాలకు ఎరువులు సరఫరా చేయలేకపోయారు. ఎరువులు రవాణా చేసే గుత్తేదారు మెుండికేసి, రవాణా నిలిపివేసినా ఆగ్రోస్, వ్యవసాయశాఖల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. పురుగు మందుల విషయంలోనూ ఆర్బీకేల్లోని కియోస్కిల్లో కనీసం ఏ మందులు అందుబాటులో ఉన్నాయనే జాబితా కూడా ఉంచలేకపోయారు. ఈ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న అధికారులు మార్పులకు శ్రీకారం చుట్టారు.

అనంతపురం జిల్లాలో 859 రైతు భరోసా కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలకు అనుసంధానిస్తూ గోదాములు నిర్మించాలని నిర్ణయించారు. ఇకపై ఎరువులు, పురుగు మందులు, విత్తనాల కోసం రైతులు ఆర్బీకేల్లో డబ్బు చెల్లించిన వెంటనే ఆయా వ్యవసాయ ఉత్పాదకాలు అందించనున్నారు. గతంలో ఏపీ ఆగ్రోస్ ద్వారా ఈ ఉత్పాదకాలన్నీ నిల్వ, రవాణా చేసేవారు. ఇకపై మార్క్ ఫెడ్ ద్వారా రైతులకు అవసరమైన అన్ని ఉత్పాదకాలు గ్రామస్థాయిలోనే అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లాలో ఆర్బీకేలకు సమీపంలో 250 గ్రామాల్లో ప్రభుత్వ భవనాలుండగా, 304 గ్రామాల్లో ఆర్బీకేల్లోనే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను నిల్వచేసే స్థలం ఉంది. 24 గ్రామాల్లో ప్రాథమిక సహకార సంఘాల భవనాలను గోదాములుగా మార్చారు. 274 గ్రామాల్లో ప్రైవేట్ భవనాలను అద్దెకు తీసుకొని గోదాములు ఏర్పాటు చేస్తున్నారు. ఖరీఫ్ లో రైతులకు సకాలంలో సేవలందలేదని, అందువల్లే గ్రామాల్లోనే గోదాముల ఏర్పాటుకు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
రైతు భరోసా కేంద్రాల్లో ఒక్కొక్కటిగా మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నప్పటికీ, రైతులకు సేవలందించే సిబ్బంది విషయంలో మాత్రం కఠినంగా ఉండటంలేదు. చాలా మంది ఆర్బీకేల సిబ్బంది విధులకు రావటంలేదని జిల్లా అధికారుల ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూస్తోంది.

వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న రైతు భరోసా కేంద్రాలు

ఇదీ చదవండీ....'జగనన్న తోడు' ప్రారంభం.. చిరు వ్యాపారుల ఖాతాల్లోకి రూ. 905 కోట్లు

Last Updated : Nov 25, 2020, 8:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.