ETV Bharat / state

సేవ్‌ తాడిపత్రి’ ఫలించిందా! - TDP won in Tadipatri, Anantapur district.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా గెలిచింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యూహం ఫలించింది. పురపాలికలోని 36 వార్డుల్లో రెండు వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. 34 వార్డులకు ఎన్నికలు జరగగా.. తెదేపా 18, వైకాపా 14, సీపీఐ, స్వతంత్రులు తలొకటి గెలుచుకున్నారు

సేవ్‌ తాడిపత్రి’ ఫలించిందా!
సేవ్‌ తాడిపత్రి’ ఫలించిందా!
author img

By

Published : Mar 15, 2021, 5:49 AM IST

సేవ్‌ తాడిపత్రి’ ఫలించిందా!

పురపోరులో రాష్ట్రవ్యాప్త పరిస్థితి ఎలా ఉన్నా.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా గెలిచింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యూహం ఫలించింది. పురపాలికలోని 36 వార్డుల్లో రెండు వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. 34 వార్డులకు ఎన్నికలు జరగగా.. తెదేపా 18, వైకాపా 14, సీపీఐ, స్వతంత్రులు తలొకటి గెలుచుకున్నారు. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు తెదేపాకు అనుకూలంగా ఉన్నారు. వైకాపాకు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ రంగయ్య నమోదు చేసుకున్నారు. దీంతో ఆ పార్టీబలం 18కి చేరుతుంది. తెదేపా తరఫున ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవడంతో తెదేపా సొంతబలం 19 అవుతుంది. ఫలితాలు వెలువడ్డాక తెదేపాకు చెందిన 18 మందితోపాటు సీపీఐ, స్వతంత్రులనూ జేసీ పవన్‌రెడ్డి ప్రత్యేక శిబిరానికి తరలించారు.
సేవ్‌ తాడిపత్రి నినాదం
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి హయాంలో చేసిన అభివృద్ధినే ప్రచారాస్త్రంగా ఉపయోగించుకున్నారు. మీ ప్రాంతాన్ని మీరే కాపాడుకోవాలంటూ ‘సేవ్‌ తాడిపత్రి’ అనే నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు. పోలీసులు తన వాహనాన్ని అడ్డుకున్నా.. కాలినడకన వీధుల వెంట తిరిగారు. ఆరోగ్యం సహకరించకపోయినా సహాయకుల అండతో ప్రచారం చేశారు. తాడిపత్రి మున్సిపాలిటీకి గతంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి వైస్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. అప్పుడు పట్టణంలో మొక్కలు నాటించడం, రోడ్ల నిర్మాణం, వీధులను శుభ్రం చేయించడం, వ్యర్థాల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టారు. 2014లో ఎమ్మెల్యే అయ్యాక కూడా అభివృద్ధి కొనసాగించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడినా.. తాడిపత్రిలో 1500కు పైగా మెజార్టీ వచ్చింది.
సానుభూతి పనిచేసిందా..
గతేడాది మార్చిలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల సమయంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి ఓ కేసుపై జైల్లో ఉన్నారు. దీంతో పార్టీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌రెడ్డి తీసుకున్నారు. ఆ సమయంలో అధికార పార్టీకి భయపడి కొందరు బలమైన నాయకులు ముందుకురాలేదు. ఆసక్తి ఉన్నవారితో నామినేషన్లు దాఖలు చేయించారు. ప్రభాకర్‌రెడ్డి కూడా జైలు నుంచే లాయర్‌ ద్వారా నామినేషన్‌ వేశారు. దీంతో జేసీ కుటుంబానికి సానుభూతి పెరిగింది.
దీపక్‌రెడ్డి ఓటు చెల్లదంటూ ఫిర్యాదు
తాడిపత్రి పురపాలిక ఎన్నికల్లో ఎక్స్‌ అఫీషియో సభ్యులు కీలకంగా మారారు. వైకాపాకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ రంగయ్య ఉండగా.. తెదేపాకు ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఉన్నారు. అయితే దీపక్‌రెడ్డికి రాయదుర్గంలోనూ ఓటు ఉందని, ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారని, అందువల్ల తాడిపత్రిలో ఆయన ఓటును పరిగణనలోకి తీసుకోవద్దని ఎమ్మెల్యే పెద్దారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదుచేశారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు పురపాలక కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌రెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి

రికార్డు విజయాన్ని అందుకున్న వైకాపా.. కలిసొచ్చిన అంశాలేంటీ..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.