ETV Bharat / state

TDP Leaders Protest Against Chandrababu Arrest: బాబు అరెస్టుపై కొనసాగుతున్న దీక్షలు.. ఎగసిపడుతున్న నిరసన జ్వాలలు.. - చంద్రబాబు అరెస్టుపై కొనసాగుతున్న నిరసనలు

TDP Leaders Protest Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు సత్యమేవ జయతే పేరుతో నిరాహార దీక్షలు చేపట్టారు. బాబుతో నేను అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. "సైకోపోవాలి.. సైకిల్‌ రావాలి" అంటూ నిరసనలో హోరెత్తిస్తున్నారు.

TDP_Leaders_Protest_Against_Chandrababu_Arrest

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 2, 2023, 4:55 PM IST

Updated : Oct 2, 2023, 8:29 PM IST

TDP Leaders Protest Against Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రాయలసీమ జిల్లాలో తెలుగుదేశం శ్రేణులు ఒక్క రోజు నిరాహార దీక్ష చేప్టటారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో యాదవ సంఘాల ఆధ్వర్యంలో దీక్ష చేశారు. "సైకో పోవాలి.. సైకిల్ రావాలి" అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని యాదవ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా నారావారిపల్లెలో చంద్రబాబు సోదరి హైమావతి, చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు.

TDP Leaders Protest Against Chandrababu Arrest: బాబు అరెస్టుపై కొనసాగుతున్న దీక్షలు.. ఎగసిపడుతున్న నిరసన జ్వాలలు..

మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరై చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు సత్యమేవ జయతే దీక్షలో పాల్గొన్నారు. నెల్లూరు తెలుగుదేశం పార్టీ నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో మాజీ మంత్రి నారాయణ పాల్గొన్నారు. మహాత్మాగాంధీ బ్రిటిషర్లతో పోరాడినట్లు.. ప్రభుత్వ అరాచకాలపై పోరాడాల్సి వస్తోందని తెలుగుదేశం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

Protests Across the State Condemning Chandrababu Arrest: అధినేత అరెస్టుపై ఆగని నిరసనలు.. ఆంక్షలు విధించినా ఆగని స్వరాలు

ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో దీక్ష చేశారు. నల్ల రిబ్బన్లు ధరించిన టీడీపీ శ్రేణులు దీక్షలో పాల్గొన్నారు. చంద్రబాబు విడుదలయ్యే వరకు తమ పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. బాపట్ల జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పట్టణంలో ర్యాలీ చేసి దీక్షా శిబిరంలో బైఠాయించారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ కొంతమంది కార్యకర్తలు శిరోముండనం చేయించుకున్నారు.

వైసీపీ పాలన రాష్ట్రానికి శాపంగా మారిందని బాపట్ల జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ఆరోపించారు. చంద్రబాబుపై దొంగ కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం లేదని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ చదలవాడ అరవింద బాబు చేతులకు సంకెళ్లు వేసుకుని రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.

TDP Fan Different Protest in Narasaraopet: మోకాళ్లపై కోర్టుకు.. నరసరావుపేటలో టీడీపీ అభిమాని వినూత్న నిరసన

వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం ఖాయమని బొండా ఉమ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు సత్యమేవ జయతే దీక్ష చేపట్టారు. నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. దీక్షకు జనసేన నేతలు, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కుమారుడు జీవీ శ్రీరాజ్ సంఘీభావం ప్రకటించారు. సీఎం జగన్‌ను ఇంటికి పంపాల్సిన బాధ్యత మహిళలపైనే ఉందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు.

నర్సీపట్నంలో తెలుగు మహిళలు చేపట్టిన రిలే నిరాహారదీక్షలో ఆయన పాల్గొన్నారు. ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్న పోలీసులు ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయ్యన్న పేర్కొన్నారు. విజయనగరంలోని టీడీపీ కార్యాలయంలో మహిళలు.. "సత్యమేవ జయతే దీక్ష" చేపట్టారు. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు.. మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి దీక్షను ప్రారంభించారు.

దురదృష్టవశాత్తు ప్రజాస్వామ్యంతో సంబంధం లేని రాష్ట్ర ప్రభుత్వం కారణంగా తమ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు అయ్యారని అశోక్‌ గజపతిరాజు వాపోయారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మదనాపురంలోని శివాలయంలో టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు వంశధార నదిలో జలాన్ని సేకరించి శివునికి జలాభిషేకం చేశారు. చంద్రబాబును ఆ భగవంతుడు క్షేమంగా చూడాలని వేడుకున్నారు.

Chandrababu Initiation in Rajamahendravaram Jail: 'సత్యమేవ జయతే' పేరిట జైలులో చంద్రబాబు.. బయట భువనేశ్వరి దీక్షలు

Last Updated : Oct 2, 2023, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.