ETV Bharat / state

అచ్చెన్నాయుడి అరెస్ట్​పై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతల ధర్నా..

మాజీమంత్రి అచ్చెన్నాయుడి అరెస్ట్​కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నాయకులు ఆందోళన చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని నేతలు మండిపడ్డారు. అక్రమంగా అరెస్టు చేసిన అచ్చెన్నాయుడిని... వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

tdp leaders protest against atchannaidu arrest
అచ్చెన్నాయుడి అరెస్ట్​కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతల ధర్నా
author img

By

Published : Jun 12, 2020, 6:34 PM IST

అనంతపురం జిల్లాలో ....

  • మడకశిర ..

మాజీమంత్రి అచ్చెన్నాయుడి అరెస్ట్​కు నిరసనగా.. అనంతపురం జిల్లా మడకశిరలో తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. అచ్చెన్నాయుడు అరెస్ట్​కు నిరసనగా ఎమ్మెల్సీ తిప్పేస్వామి, తెదేపా కార్యకర్తలు కలిసి జ్యోతిరావు పూలే విగ్రహానికి వినతి పత్రం అందించారు. సర్జరీ చేసుకున్న వ్యక్తిపై 300 మంది పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరు పోలీసులా..? లేక వైకాపా గుండాలా..? అంటూ మండిపడ్డారు. గత 60 సంవత్సరాల రాజకీయంలో ఎన్నడూ ఇలాంటి కక్షసాధింపులకు పాల్పడలేదని... జగన్ మొట్టమొదటిసారిగా కక్షసాధింపులకు పాల్పడుతున్నాడన్నారు. అరెస్టు చేసిన అచ్చెన్నాయుడిని... బేషరతుగా విడుదల చేసి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

  • హిందూపురం..

అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం వద్ద తెదేపా నాయకులు ధర్నా చేశారు. అచ్చెన్నాయుడి అరెస్ట్​ని నిరసిస్తూ వారు ప్లకార్డులు పట్టుకొని.. నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయనను అరెస్టు చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని... రాజకీయ కక్షలు ఆపేసి రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను.. అక్రమ అరెస్టులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అప్రజాస్వామిక పద్ధతిలో ఆయనని అరెస్టు చేయడం సబబు కాదన్నారు.

కృష్ణా జిల్లా ...

  • విజయవాడ..

కృష్ణా జిల్లా విజయవాడలో తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్​ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయనను బయటికి వెళ్లకుండా.. పహారా కాశారు. ఆరోగ్యంగా లేని వ్యక్తిని.. ఎలాంటి సమాచారం లేకుండా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అసెంబ్లీలో అచ్చెన్నాయుడు ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతాడనే ఉద్దేశంతో.. ఈ విధంగా ప్రవర్తించారని ఆరోపించారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

  • మైలవరం ..

మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడం వైకాపా ప్రభుత్వ కక్షసాధింపు ధోరణి అని ఆరోపిస్తూ కృష్ణా జిల్లా మైలవరం తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అచ్చెన్నాయుడిని వెంటనే విడుదల చేయకపోతే నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

గుంటూరు జిల్లా....

  • మంగళగిరి..

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. మంగళగిరిలో అంబేడ్కర్ విగ్రహానికి తెదేపా నేతలు వినతి పత్రం అందించి ధర్నా చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని.. వెంటనే అచ్చెన్నాయుడిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

  • తాడేపల్లి..

తాడేపల్లిలో ఆ పార్టీ నేతలు జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి వినతి పత్రం ఇచ్చారు. అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం కావాలనే బీసీలు, ఎస్సీలపై కక్ష కట్టిందని తెదేపా నేతలు ఆరోపించారు. వైద్యులు, మాజీ మంత్రులపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని విమర్శించారు.

  • నరసరావుపేట

అచ్చెన్నాయుడి అరెస్ట్ ప్రభుత్వ దుర్మార్గపు చర్యకు నిదర్శనమని గుంటూరు జిల్లా నరసరావుపేట తెదేపా ఇన్​ఛార్జ్ చదలవాడ అరవింద బాబు అన్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్​ను ఖండిస్తూ తెదేపా నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి వినతిపత్రాన్ని అందజేశారు. తెదేపా నేతలపై ప్రస్తుత వైకాపా ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వ అవినీతిని ఎక్కడ బయటపెడతాడో అన్న భయంతోనే .. అరెస్ట్ చేశారని అరవింద బాబు ఆరోపించారు. ప్రభుత్వ దుశ్చర్యను ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయ అణచివేత ధోరణిని మానుకోవాలని సూచించారు.

విజయనగరం జిల్లా..

  • చీపురుపల్లి

మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టును విజయనగరం జిల్లా చీపురుపల్లి తెదేపా నాయకులు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని మండల అధ్యక్షులు పైలా బలరాం అన్నారు. అప్పట్లో ఉన్న నిబంధనల మేరకే కొనుగోలు వ్యవహారాలు జరిగాయన్నారు. దీనిని సాకుగా చూపి బీసీ నాయకుడైన అచ్చెన్నాయుడని అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. దీన్ని అరెస్ట్​గా కూడా పరిగణించలేక పోతున్నామని ..ఇది కిడ్నాపే అని ఆరోపించారు.

  • సాలూరు

మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్ట్​ను వ్యతిరేకిస్తూ సాలూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ధర్నా చేపట్టారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నందున..ఆయనకు భయపడి అక్రమ అరెస్ట్​ చేశారని ఆమె అన్నారు. అచ్చెన్నాయుడిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

చిత్తూరు జిల్లా .....

  • కుప్పం

తేదేపా నేత అచ్చెన్నాయుడు అరెస్ట్​కు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెదేపా నాయకులు ధర్నా చేపట్టారు. నాలుగు మండలాల్లో నాయకులు.. కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు అచ్చెన్నాయుడిని వెంటనే విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.

  • చంద్రగిరి

మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టును తప్పుపడుతూ చంద్రగిరి నియోజకవర్గ తెదేపా నాయకులు సమదూరం పాటిస్తూ నిరసన చేశారు . చంద్రగిరిలో నియోజకవర్గ సమన్వయకర్త గంగపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో తెదేపా నాయకులు నూర్ జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. పాకాల మండలంలో బస్టాండ్ కూడలివద్దగల అంబేద్కర్ విగ్రహం వద్ద మండల తెదేపా నాయకులు ధర్నా చేశారు. వైకాపా ప్రభుత్వం బీసీలను చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. తెదేపాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని నాయకులు తెలిపారు.

నెల్లూరు జిల్లా ...

  • నెల్లూరు..

అచ్చెన్నాయుడి అరెస్ట్​ను నిరసిస్తూ నెల్లూరులో తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టింది. నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నాయకులు నివాళులు అర్పించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తారన్న ఉద్దేశంతోనే ఇలా చేశారని నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. అక్రమ కేసులు బనాయిస్తూ.... ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. అచ్చం నాయుడును వెంటనే విడుదల చేయకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

  • టీఎన్​ఎస్​ఎఫ్​ ఆధ్వర్యంలో...

శాసనసభా పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు అక్రమ అరెస్ట్​ను నిరసిస్తూ నెల్లూరులో టీఎన్ఎస్ఎఫ్ నిరసన చేపట్టింది. నగరంలోని పూలే విగ్రహానికి వినతి పత్రం అందించారు. పొర్లుదండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. కనీసం నోటీసు ఇవ్వకుండా, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడం దారుణమని జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడు అన్నాడు. బీసీలను అణచివేసేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

విశాఖ జిల్లా ....

అచ్చెన్నాయుడి అరెస్టును నిరసిస్తూ విశాఖలో తెలుగుదేశం శ్రేణులు పాదయాత్ర చేశారు. తెదేపా కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేశ్ కుమార్, వెలగపూడి రామకృష్ణబాబుతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు కాలినడకన గాంధీవిగ్రహం వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వం అక్రమ అరెస్టు చేసిందని నినాదాలు చేశారు. అనంతరం మహాత్ముడి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేశారు.

తూర్పుగోదావరి జిల్లా ....

  • రాజమహేంద్రవరం..

జిల్లాలోని రాజమహేంద్రవరంలో తెదేపా నేతలు అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించారు. అచ్చెన్నాయుడి అరెస్టును వారు ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని.. వెంటనే అచ్చెన్నాయుడిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

  • ప్రత్తిపాడు

బీసీ నాయకుడు అచ్చెన్నాయుడి అరెస్టుకు నిరసనగా ప్రత్తిపాడు తెదేపా శ్రేణులు నిరసన చేపట్టాయి. ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్‌ వరుపుల రాజా ఆయన అరెస్ట్​ను ఖండించారు. బీసీల హక్కుల గురించి పోరాడుతున్న అచ్చెన్నాయుడి గొంతు నొక్కాలని.. ప్రభుత్వం అరెస్టు చేసిందని ఆరోపించారు. అచ్చెన్నాయుడిని వెంటనే విడుదల చేయకపోతే నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

  • కాకినాడ..

అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో తెదేపా నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబేద్కర్‌ భవనం వద్ద ముందుగా మహాత్మాజ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగన్‌ అవినీతిని ఎండగట్టినందుకే అచ్చెన్నాయుడిపై కక్షసాధింపుకు దిగారని నగర మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం శాడిజం పరాకాష్టకు చేరిందని... ప్రతిపక్షాన్ని అసెంబ్లీలో ఎదుర్కొలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. వైకాపా ఏడాది పాలనలో అవినీతి కుంభకోణాలు, ఇసుక, మద్యం, గనులు, భారతీ పాలిమర్స్‌ నిధుల కేటాయింపు, ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు, భూసేకరణలో అవకతవకలను నిలదీస్తామనే ఉద్దేశంతోనే అక్రమ అరెస్టుకు దిగారని అన్నారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

  • ముమ్మిడివరం

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అనిశా అధికారులు అరెస్టు చేయడాన్ని తూర్పుగోదావరి ముమ్మిడివరం నియోజకవర్గం నేతలు ఖండించారు. పరిధిలోని తాళ్ళరేవు. ఐ పోలవరం, ముమ్మడివరం, కాట్రేనికోన మండలాల్లోని తెదేపా నాయకులు నిరసన చేశారు. నాయకుని తక్షణం విడుదల చేయాలని కోరుతూ స్థానిక తహసీల్దార్​లకు వినతి పత్రాలు సమర్పించారు.

ప్రకాశం జిల్లా...

  • ఒంగోలు..

వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని ప్రకాశంజిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. అచ్చెనాయుడి అరెస్ట్​కు నిరసనగా ఒంగోలులో కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. రాష్టంలో ప్రభుత్వ చర్యలకు.. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని దుయ్యబట్టారు. బీసీలను అణగదొక్కేరీతిలో ప్రభుత్వం ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. శాసనసభాపక్ష నేతగా ఉన్న ఆయనికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్​ చేయడమేంటని ప్రశ్నించారు.

  • కనిగిరి..

ప్రకాశంజిల్లా కనిగిరిలోమాజీ మంత్రి అచ్చెన్నాయుడు అక్రమ అరెస్ట్​ను ఖండిస్తూ కనిగిరి నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్, డా.ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ధర్నా చేశారు. ఆర్టీసీ డిపో వద్ద జ్యోతిరావ్ పూలే విగ్రహనికి పూలమాల వేసి నిరసన తెలిపారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపడం వల్ల అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని.. ఇది బీసీ కులాలను అవమాన పరచడమేనని అన్నారు. బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నందున బీసీ నాయకుడైన అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా...

మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి అరెస్టు వ్యతిరేకంగా.. శ్రీకాకుళం జిల్లాలో తెదేపా నిరసనలు వెల్లువెత్తాయి. శ్రీకాకుళం మహాత్మ జ్యోతిరావు పూలే పార్కు వద్ద తెదేపా నేతలు నల్ల జెండాలతో నిరసన ధర్నా చేశారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్, మాజీ ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గుండ లక్ష్మీదేవి, కావలి ప్రతిభాభారతి, తెదేపా జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి.

లైవ్ అప్​డేట్స్: న్యాయ పోరాటం చేస్తాం: రామ్మోహన్‌నాయుడు

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు

అచ్చెన్నాయుడిపై ఈఎస్​'ఐ'.. ఏసీబీ ఏం చెబుతుందంటే..?

'బాబాయ్​ని అరెస్టు చేసింది ఏసీబీనా?... గూండాలా?'

'పక్కా ఆధారాలతోనే అచ్చెన్నాయుడు అరెస్టు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.