లంచాలు తీసుకుని మూడంతస్తుల భవనానికి అనుమతిచ్చి.. ఆరుగురు మృతికి కారణమైన అనంతపురం జిల్లా కదిరి మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారుల(Kadiri Municipal Commissioner Town Planning Officers)పై చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
పాత భవనంపై నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం వల్లే.. కదిరిలో మూడు భవనాలు కూలిపోయి ఆరుగురు మృతి చెందారని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. పాత భవనాలపై అంతస్తుకు అనుమతిచ్చిన మున్సిపల్ అధికారులపై క్రిమినల్ కేసులు (Criminal cases)నమోదు చేయాలని, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
బాధితులకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. పోలీసులు, మునిసిపల్ కమిషనర్ సర్దిచెప్పడానికి ప్రయత్నించినా.. వారు వినకుండా కార్యాలయం ఎదుటనే బైఠాయించారు.
ఇదీ చదవండి : Buildings collapsed: కదిరిలో విషాదం.. భవనాలు కూలి ఆరుగురు మృతి