ETV Bharat / state

బీసీల బాంధవుడు చంద్రన్న, బీసీల వెన్ను విరుస్తున్న జగనన్న-టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు - People Should Give Good Result in 2024 Elections

TDP Former Minister Kalva srinivasulu Fires On Jagan Government: బీసీల బాంధవుడు చంద్రన్న, బీసీల వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి అనే కరపత్రాలను మంగళవారం టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు టీడీపీ కార్యాలయంలో విడుదల చేశారు. సామాజిక బస్సు యాత్ర పేరుతో ప్రజలను మోసం చేయడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం చేయకుండా సామాజిక యాత్ర ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం రెడ్ల ప్రభుత్వం అని శ్రీనివాసులు విమర్శించారు.

TDP_Former_Minister_Kalva_srinivasulu_Fires_On_Jagan_Government

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2023, 3:33 PM IST

TDP Former Minister Kalva srinivasulu Fires On Jagan Government: రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేయడానికి వైసీపీ(YCP) ప్రభుత్వం సామాజిక బస్సు యాత్ర పేరుతో ప్రయత్నిస్తోందని టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. వైసీపీ మంత్రులు, నాయకులు దగా కోరు దండయాత్రను చేపడుతున్నారని శ్రీనివాసులు మండిపడ్డారు. అనంతపురం జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో కాల్వ శ్రీనివాసులు పార్టీ శ్రేణులతో కలిసి బీసీల బాంధవుడు చంద్రన్న, బీసీల వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి అనే కరపత్రాల(Pamphlets)ను విడుదల చేసి మాట్లాడారు.

బీసీల బాంధవుడు చంద్రన్న, బీసీల వెన్ను విరుస్తున్న జగనన్న-టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

'బీసీల విషయంలో జగన్ విఫలమయ్యారు'

YCP Government is Trying to Cheat People Through samajika Bus Yatra: సామాజిక బస్సు యాత్ర నిర్వహించడానికి వైసీపీ ప్రభుత్వానికి అర్హత లేదని శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. మోసగాళ్లంతా కలిసి నయవంచన యాత్ర చేస్తున్నారని శ్రీనివాసులు విమర్శించారు. మంత్రులంతా విలన్లుగా ఉంటూ ప్రధాన విలన్​గా జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం చేయకుండా సామాజిక యాత్ర ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు తగ్గించి 74 మంది హత్యకు జగన్ సర్కార్ కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను అతికిరాతంగా హతమార్చింది వైసీపీ ప్రభుత్వం అని శ్రీనివాసులు మండిపడ్డారు. బీసీలకు రాజ్యంగ బద్ధంగా సంక్రమించిన 16,800 స్థానిక సంస్థల పోస్టులను రిజర్వేషన్లు 10శాతానికి తగ్గించి, బీసీల గొంతు కోస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికే చెల్లుతుందన్నారు. దళిత యువకుడిని వైసీపీ నాయకులు హత్య చేసి ఇంటికి డోర్ డెలివరీ చేశారని కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి సానుభూతి తెలిపేందుకు సామాజిక బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఉందన్నారు. ఏ వర్గానికి న్యాయం చేయని జగన్ ప్రభుత్వం మరోసారి ఎన్నికల్లో గెలిచి అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడానికి ఈ దొంగ యాత్రలు చేపడుతున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ప్రజలు గట్టి బుద్ధి చెప్పాలని కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

kalva srinivasulu criticized the government : 'తుంగభద్ర ఎగువ కాలువకు గండి.. పట్టించుకోని అధికారులు'

People Should Give Good Result in 2024 Elections: అభివృద్ధిని సమాధి చేసి ప్రజలకు ఎన్నో చేశామని చెబితే ఎవరు నమ్ముతారని శ్రీనివాసులు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం బలహీన వర్గాల వ్యతిరేక,పెత్తందారుల, రెడ్ల ప్రభుత్వం అని ఎద్దెవా చేశారు. ఒక సభలో వైవీ సుబ్బారెడ్డి కాళ్లకు నమస్కరిస్తున్న చెల్లుబోయిన వేణుగోపాల్ చిత్రాన్ని చూపుతూ బీసీల ఆత్మగౌరవాన్ని రెడ్ల పాదాక్రంతం చేసిన వీరు బీసీ మంత్రులా అని మండిపడ్డారు.

సామాజిక బస్సు యాత్ర దగా కోరుల దండయాత్ర. బడుగు బలహీన వర్గాల మీద సాగిస్తున్న దండయాత్ర అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం జరిగిన పరిణామాలు ప్రజలు దృష్టిలో ఉంచుకుని జగన్ ప్రభుత్వానికి తగిన సమాధానం ఇవ్వాలని కాల్వ శ్రీనివాసులు కోరారు.

TDP Leader Kalva Srinivasulu On YSRCP Samajika Bus Yatra: "వైసీపీ నేతల సామాజిక బస్సు యాత్ర.. దగాకోరు దండయాత్రగా కనిపిస్తోంది"

For All Latest Updates

TAGGED:

Tdp on ycp
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.