శింగనమల మండలం నాగులగుడెం తాండాలో తెదేపా మద్దతుదారురాలు లక్ష్మిదేవి అనే అభ్యర్థి పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందింది. ఈ ఫలితాన్ని జీర్ణించుకొలేని వైకాపా నాయకులు.. తమ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ బండారు శ్రావణి శింగనమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వెంటనే పోలీసులు స్పందించి తాండా గ్రామంలో పికెట్లు ఏర్పాటు చేసి తెదేపా నాయకులు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. శింగనమల ఎస్సై ఫిర్యాదు తీసుకోకుటే ధర్నా చేస్తామని హెచ్చరించారు. చివరికి ఎస్సై మస్తాన్ వలీ వచ్చి ఫిర్యాదు తీసుకుని.. రక్షణ కల్పిస్తామని చెప్పడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఇదీ చదవండి: