Tadipatri YCP MLA Ketireddy Peddareddy Sensational Comments: ఎన్నికలు దగ్గరకు పడతున్న తరుణంలో తాడిపత్రి రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార, ప్రతిపక్షాలకు చెందిన ఇద్దరు నేతలు స్పరస్పర ఒక్కరిపై మరోకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇరువురు నేతల సవాళ్లతో తాడిపత్రిలో రాజకీయాలు మరో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా, తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న చందంగా, రాజకీయాలు మారిపోయాయి. తాజాగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వచ్చినా, రాకపోయినా నాలుగు నెలల్లో తానేంటో చూపిస్తానని సవాల్ విసిరారు.
టిడ్కో ఇళ్లు అప్పగించకుండా జగన్ మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడు: జేసీ ప్రభాకర్ రెడ్డి
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా : తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (MLA Ketireddy Peddareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల తర్వాత నా అసలు రూపం చూస్తారని, ఫ్యాక్షన్ని మళ్లీ మొదలు పెడతానని పరోక్షంగా జేసీ ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన నా ప్రత్యర్థులను వదిలి ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ, పంటకు చీడపురుగు ఎంత ప్రమాదమో రాజకీయాల్లో కూడా చీడ పురుగు కూడా అంతే ప్రమాదమని వాటిని కచ్చితంగా ఏరి వేస్తానన్నారు.
తాడిపత్రికి రావద్దు - నిజాయితీగా పని చేస్తే సస్పెండ్ చేస్తారు: జేసీ ప్రభాకర్ రెడ్డి
మున్సిపల్ ఆస్తులను జేసీ కొల్లగొట్టారు: జేసి ప్రభాకర్ రెడ్డి నాపై కరపత్రాలు వేసి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కేతిరెడ్డి ఆరోపించారు. కానీ, నేను సంపాదించిన ప్రతి ఒక్కటి సక్రమమేనని పెద్దారెడ్డి అన్నారు. జేసి ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) అవినీతిపై చర్చకు ఎక్కడైనా ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. గతంలో జెండాలు తొలగించకుండా సుందరీకరణ పనులు చేస్తామని జేసీ లేఖ ఇచ్చారని, ఇప్పుడేమో వైసీపీ (YCP) జెండాలు తొలగించాలని జేసీ ఆందోళన చేయడం హాస్యాస్పదం అన్నారు. బినామీ పేర్లతో తాడిపత్రి మున్సిపల్ ఆస్తులను జేసీ కొల్లగొట్టారని, ఆయన అవినీతి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధం అన్నారు.
తాడిపత్రిలో ముప్పై సంవత్సరాలుగా ఏకచ్ఛత్రాధిపత్యం కొనసాగుతోంది. అది చూడలేకనే నేను ఎదురు తిరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, మూడు నాలుగు నెలల్లో వేట మెుదలుపెడతాను. చేతనైతే ఎదుర్కొవాలి. నేను రైతు బిడ్డను, వ్యవసాయం చేశాను, పంటలో పురుగు పడితే ఏ విధంగా తీయాలో నాకు తెలుసు.రాజకీయాల్లో కూడా అడ్డదారులు తొక్కేవారిని సైతం వదిలిపెట్టను. -ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి