ETV Bharat / state

భార్యను పుట్టింటికి తీసుకెళ్లిందని అత్తను హతమార్చిన అల్లుడు..! - చెన్నంపల్లిలో అత్తను చంపిన అల్లుడు వార్తలు

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లిలో దారుణం జరిగింది. తన భార్యను పుట్టింటికి తీసుకెళ్లిందని అత్తపై అల్లుడు కొడవలితో దాడికి పాల్పడ్డాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

aunt killed by sun in law
భార్యను పుట్టింటికి తీసుకెళ్లిందని .. అత్తను హతమార్చిన అల్లుడు
author img

By

Published : Feb 26, 2021, 10:46 PM IST

తన భార్యను పుట్టింటికి తీసుకెళ్లిందన్న కోపంతో అత్తను అల్లుడు హత్య చేసిన సంఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన హుసేన్​బీకి ముగ్గురు కూతుళ్లు. రెండో కూతురును నార్పలకు చెందిన మహబూబ్ బాషాకిచ్చి వివాహం చేసింది. అతను డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన మహబూబ్​ బాషా.. నిత్యం భార్యను వేధించేవాడు. పెద్దలు ఎన్నిసార్లు మందలించినా అతనిలో మార్పు రాలేదు. హుస్సేన్​బీ కూతురును సోమవారం తన ఇంటికి తీసుకెళ్లింది.

తన భార్యను తీసుకెళ్లిందని అత్తపై పగ పెంచుకున్న మహబూబ్​ బాషా.. చెన్నంపల్లికి వచ్చి అత్తపై కొడవలితో దాడికి చేసి పరారయ్యాడు. రక్తపుమడుగులో పడిఉన్న హుస్సేన్​బీని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.