అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనుమాపురం గ్రామానికి చెందిన శశికళ... బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. తన సొంతూరుకు వెళ్లేందుకు ఆదివారం అనంతపురం వచ్చింది. అక్కడి నుంచి కర్ణాటక ఆర్టీసీ బస్సులో ఉరవకొండకు బయలుదేరింది. ఉరవకొండలో దిగిన అనంతరం లగేజీ బాక్సులో చూడగా అందులో తన సూట్‌కేస్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై బస్సు ప్రయాణించిన మార్గంలో తనిఖీలు చేపట్టగా... కూడేరులోని ఓ బేకరీ వద్ద సూట్‌కేసును గుర్తించారు. అనంతరం సూట్‌కేసును ఉరవకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించి బాధితురాలికి అప్పగించారు. తన ఫిర్యాదుపై స్పందించి, సహాయం చేసిన పోలీసులకు శశికళ కృతజ్ఞతలు తెలిపింది.
ఇదీచదవండి.
ఇదీచదవండి: తొలిదశ నామినేషన్ల చివరిరోజు దాడుల పర్వం