ETV Bharat / state

స్నేహితులు దూరం అవుతారన్న ఆవేదనతో.. విద్యార్థిని ఆత్మహత్య - girl suicide news at ananthapur district

కదిరి పట్టణంలో ఏడో తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. వాళ్ల అమ్మకు ఉద్యోగరీత్యా బదిలీ అవగా.. స్నేహితులు దూరం అవుతారని మనస్థాపానికి గురైంది. ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

student commits suicide with the grief that his friends will be away
స్నేహితులు దూరం అవుతారాని.. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
author img

By

Published : Jan 24, 2021, 12:09 PM IST

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఏడో తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. బాలిక వాళ్ల అమ్మకు ఉద్యోగ నిమిత్తం వేరే ఊరికి బదిలి అవగా.. స్నేహితులు దూరం అవుతారేమేనని బాలిక మనస్థాపానికి గురైంది. తల్లిదండ్రులు తన దగ్గర లేని సమయాన్ని గమనించి.. మరో గదిలోకి వెళ్లి ఉరి వేసుకుంది.

'ఐ హేట్ మై లైఫ్.. అమ్మా ఐ లవ్ యూ.. అమ్మను బాగా చూసుకో నాన్నా' అంటూ సూసైడ్ నోట్​లో రాసి పెట్టి ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భోజనం చేయకుండా గదిలోకి వెళ్లిన కుమార్తెను పిలిచేందుకు వెళ్లిన తల్లి... వేలాడుతున్న బిడ్డను చూసి కేకలు వేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

'ఎవరైనా చంపడానికి వస్తే.. చంపే హక్కు మాకుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.