అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలను (SSBN College) ఎయిడెడ్ (Aided) కళాశాలగా కొనసాగించాలని ఆ కళాశాల మేనేజ్మెంట్ కమిటీ (Management Committee) ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ప్రభుత్వ ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలను ప్రైవేట్ యాజమాన్యం కిందకు మార్చటాన్ని వ్యతిరేకిస్తూ గత కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళన (Protest) చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈనెల 10న ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జి (Police Lathi Charge) చేయటం రాష్ట్రవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. లాఠీఛార్జ్ ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కళాశాలను ఎయిడెడ్ సంస్థగానే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. కళాశాలను ప్రైవేట్‌గా మార్చితే ఉద్యమం తీవ్రతరం చేస్తామని విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ (AISF), టీఎన్ఎస్ఎఫ్(TNSF) విద్యార్థి సంఘం నేతలు కళాశాల యాజమాన్యానికి, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ నేపథ్యంలోనే కళాశాల యాజమాన్యం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకుంది. ట్రస్టు విద్యా సంస్థగానే ఎయిడెడ్ కింద కొనసాగించాలని కాలేజీ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కలెక్టర్‌కు (Collector) తీర్మాన కాపీ ఇచ్చినట్లు కళాశాల కమిటీ ప్రతినిధులు వెల్లడించారు.
ఇదీ చదవండి