అనంతపురం జిల్లా త్రాగునీటి సమస్య తీర్చేందుకు గత ప్రభుత్వాలు జిల్లాలోని 1,600 గ్రామాలకు పీఏబీఆర్ డ్యాం నుంచి పైప్లైన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా శ్రీ రామిరెడ్డి తాగునీటి పథకం ద్వారా ప్రజలకు త్రాగునీరు అందించాయి. వీటి నిర్వహణలో జాప్యం కారణంగా పలుచోట్ల పైపులైను పగిలి నీటితోపాటు ప్రజాధనం వృథా అవుతోంది.
బుధవారం సాయంత్రం మడకశిర పట్టణంలోని యాదవ కళ్యాణ మండపం సమీపం వద్ద శ్రీ రామిరెడ్డి తాగునీటి పైప్ లైన్ పగలటంతో నీరు ఉవ్వెత్తున ఎగిసి పడుతూ నీరంతా వృథా అయ్యింది. నీటి ప్రవాహానికి ఆ ప్రాంతంలో నీరు నిలబడి చిన్న చెరువును తలపించింది. ఎట్టకేలకు సంబంధిత అధికారులకు విషయం తెలియడంతో ప్రస్తుతం మరమ్మతులు చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రజల దాహార్తిని తీర్చే శ్రీ రామిరెడ్డి తాగునీటి పైప్లైన్ సంరక్షణలో అలసత్వం వహించక నీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల జలవివాదం: క్రియాశీలకం కానున్న కృష్ణాబోర్డు