అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని రోళ్ల మండల కేంద్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ నెల ఏడో తేదీ నుంచి 16వ తేదీ వరకు పది రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ బ్రహ్మ రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథాన్నిలాగేందుకు పోటీ పడ్డారు. అనంతరం ఆలయ కమిటీ నేతృత్వంలో అన్నదానం జరిగింది.
ఇదీ చూడండి: