అనంతపురం జిల్లా పాతగుంతకల్లులోని శివాలయంలో వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ రైతులు సప్త భజనలు ప్రారంభించారు. ఈ భజనలు నేటి నుండి వారం రోజులపాటు కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. మొదటగా పవిత్ర గంగతో ఆలయాన్ని శుద్ధి చేసి కలశ ప్రతిష్ఠ చేసి, శివునికి పూజలు నిర్వహించారు. మహా మంగళ హారతి, అభిషేకాలు చేసిన అనంతరం భజనలు మొదలుపెట్టారు. తడిగుడ్డలతో ఆగకుండా వారం రోజులుపాటు శివుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహిస్తారని పూజారులు చెప్పారు. ఆదివారం రోజు సాయంకాలానికి పూజలు సంపూర్ణమవుతాయని పండితులు తెలిపారు. రైతులు మాట్లాడుతూ...సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడిపంటలతో రాష్ట్రం, తమ పట్టణం సురక్షితంగా ఉండటానికే ఈ భజనలు మొదలుపెట్టామని అన్నారు. పురాణాల నుండి ఇదే క్రమము ఆచరిస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి 'పిల్లలకు ఇలాంటి ఆహారం పెడతారా?''