ETV Bharat / state

ఆర్జీవీ ఇంటికి ఏపీ పోలీసులు - అరెస్టుకు రంగం సిద్ధం!

పోలీసుల విచారణకు గైర్హాజరైన ఆర్జీవీ - రామ్​గోపాల్‌వర్మ అరెస్టుకు రంగం సిద్ధం చేసిన ఒంగోలు పోలీసులు

Ramgopal Varma Case
Ramgopal Varma Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2024, 10:30 AM IST

Updated : Nov 25, 2024, 1:46 PM IST

Ram Gopal Varma Case : సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ప్రకాశం జిల్లా ఒంగోలు గ్రామీణ పోలీసుల విచారణకు రెండోసారి గైర్హాజరయ్యారు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కళ్యాణ్​ను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ ఆయనపై మద్దిపాడు పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైన విషయం తెలిసిందే. టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఆయనపై ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించాలంటూ రామ్​గోపాల్​వర్మ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈనెల 19న విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తనకు 4 రోజుల సమయం కావాలంటూ ఆర్జీవీ అదేరోజు వాట్సప్‌లో ఒంగోలు పోలీసులకు సమాచారం పంపారు. అనంతరం 25న ఉదయం విచారణకు హాజరుకావాలంటూ మరోసారి రామ్​గోపాల్​వర్మకి నోటీసులు ఇచ్చారు.

Police on Ram Gopal Varma : ఇవాళ కూడా రామ్​గోపాల్​వర్మ విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలోనే ఆయన అరెస్టుకు ఒంగోలు పోలీసులు రంగం సిద్ధం చేశారు. హైదరాబాద్​లోని వర్మ నివాసానికి చేరుకున్నారు. అయితే ఆర్జీవీ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఓ వివాహానికి హాజరైనట్లు ట్వీట్ చేశారు. మరోవైపు డిజిటల్ మోడ్‌లో విచారణకు హాజరవుతానని రామ్​గోపాల్‌వర్మ తెలిపారు. అయితే డిజిటల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు చెప్పారు.

Ramgopal Varma Case
రామ్​గోపాల్​వర్మ ఇంటి బయట వేసి చూస్తున్న ఏపీ పోలీసులు. (ETV Bharat)

రామ్​గోపాల్​వర్మ కోరిన విధంగా రెండుసార్లు విచారణకు అంగీకరించామని, అవకాశం కల్పించినా సద్వినియోగం చేసుకోలేదని పోలీసులు చెప్పారు. నోటీసులు ధిక్కరించినందునే అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయన మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. ఆర్జీవీ ఆచూకీ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. ఇందుకోసం రెండు బృందాలు హైదరాబాద్​ చేరుకున్నాయి.

రామ్​గోపాల్‌వర్మ హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్జీవీ సోషల్ మీడియా అకౌంట్‌ హ్యాండిల్స్ హైదరాబాద్‌లో చూపిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే శంషాబాద్, షాద్‌నగర్‌లోని 2 ఫాంహౌస్‌లపై దృష్టిపెట్టారు. సాయంత్రంలోగా ఆయణ్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కోయంబత్తూర్‌, ముంబయికి పోలీసు బృందాలు వెళ్తున్నాయి.

చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిలపై ఆర్జీవీ పోస్టు - పలు స్టేషన్లలో రామ్‌గోపాల్‌వర్మపై కేసులు నమోదు

Last Updated : Nov 25, 2024, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.