అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పోతుకుంటలో ప్రభుత్వ పాఠశాలలో పవన్ రెండో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో మరగుదొడ్ల సదుపాయం లేక మూత్ర విసర్జనకు బయకు వెళ్లాడు. అక్కడ విష సర్పం కాటేసింది. ఉపాధ్యాయులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సంఘటన జరిగి మూడు రోజులవుతున్నా బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
"నాకు క్యాన్సర్... నా కొడుక్కి చూస్తే ఇలా... ఇక మాకు గోడు ఎవరికి చెప్పుకోవాలి... మమ్మల్ని ఆదుకునే వారెవరు..." అంటూ బాలుడి తల్లి గంగమ్మ వాపోతున్నారు. పవన్‌కు వైద్యం అందిస్తున్న వైద్యురాలు మాట్లాడుతూ... మెరుగైన వైద్యం అందిస్తున్నా... బాలుడు ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడని తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉంచి వైద్యం అందిస్తున్నామని చెప్పారు. రెండురోజులు గడిచే వరకు ఎటువంటి విషయం చెప్పలేమని వైద్యురాలు తెలిపారు. వర్షాకాలంలో మారుమూల గ్రామాల్లో ప్రజలు విషసర్పాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి... ఒకే రోజు.. ఏడుగురికి పాముకాటు