ETV Bharat / state

తెలంగాణలో ఘోర విషాదం... ఈతకు వెళ్లి ఆరుగురు మృతి - మేడ్చల్​ జిల్లాలో ఆరుగురు మృతి

Six people died into pond: సరదాగా ఉపాధ్యాయుడు విద్యార్థులను విహారానికి తీసుకొని వెళ్లారు. అప్పటికప్పుడు ఉల్లాసంగా ఆడుకుంటున్న విద్యార్థులు.. ఉన్నట్టుండి పక్కనే ఉన్న చెరువులో ఈతకు వెళ్లాలి అనుకున్నారు.. ఈతకొట్టడానికి చెరువులోకి దిగిన వారు మునిగిపోతుంటే.. వారిని రక్షించే క్రమంలో ఉపాధ్యాయుడు సైతం నీటిలో మునిగి చనిపోయాడు. ఈ తీవ్ర విషాదం ఎక్కడ జరిగింది?

Six people died
ఆరుగురు మృతి
author img

By

Published : Nov 5, 2022, 3:20 PM IST

Updated : Nov 5, 2022, 5:49 PM IST

Six people died into pond: తెలంగాణలోని మేడ్చల్​ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జవహార్​నగర్​ పరిధిలో ఉన్న మల్కారంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు దిగి ఆరుగురు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. స్థానిక మదర్సా పాఠశాలలో చదివే విద్యార్థులను టూర్​లాగా ఉపాధ్యాయుడు బయటికి తీసుకెళ్లారు. ఈత కొట్టడానికి ఎర్రగుంట చెరువులోకి విద్యార్థులు దిగారు.

చెరువు లోతుగా ఉండడంతో మునిగిపోతున్న విద్యార్థులను కాపాడడానికి ఉపాధ్యాయుడు కూడా చెరువులోకి దిగారు. పిల్లలంతా ఉపాధ్యాయుడ్ని పట్టుకోవడంతో బయటకిరాలేక అందరూ నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. మృతి చెందిన విద్యార్థులంతా 12 నుంచి 14 ఏళ్ల వయసు గల వారని తెలుస్తోంది.

మృతులను నగరంలోని కాచిగూడలోని నెహ్రూనగర్​ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మల్కారంలోని మదర్సాలో ప్రత్యేక శిక్షణా తరగతుల కోసం వచ్చారని తెలిపారు. చనిపోయిన వారిలో ఇస్మాయిల్​, జాఫర్​, సోహేల్​, అయాన్​, రియాన్​.. వీరిని కాపాడేందుకు చెరువులో దూకిన వ్యక్తి యోహాన్​గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 5, 2022, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.