అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెంచలపాడు సమీపంలో జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. ఆగి ఉన్న తూఫాను వాహనంపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు కసాపురం అంజనేయస్వామి దర్శించుకుని... మురుడి, నెమకల్లు దేవాలయాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులంతా ఆలూరు, గుంతకల్లు పట్టణానికి చెందిన దగ్గరి బంధువులుగా పోలీసులు గుర్తించారు.
గాయపడిన వారిని హుటాహుటిన 108 వాహనంలో గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి వచ్చినా.. అరగంట తర్వాత కూడా చికిత్స అందించలేదని బాధితులు తెలిపారు. గుంతకల్లులో ప్రాథమిక చికిత్స తర్వాత కొందరిని అనంతపురం, మరికొందరిని కర్నూలు ఆసుపత్రులకు తరలించారు.
ఇదీ చదవండి: షాపు యజమాని నిర్లక్ష్యం.. వాటర్ బాటిల్ బదులు యాసిడ్.. తాగిన విద్యార్థి