అనంతపురం జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి పి.తిరుమలరావు(52) కరోనాతో మృతిచెందారు. కృష్ణా జిల్లాకు చెందిన తిరుమలరావు.. మూడేళ్లుగా అనంతపురం కోర్టులో పనిచేస్తున్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ) ఇన్‌ఛార్జి కార్యదర్శిగా కొద్ది రోజులు సేవలు అందించారు. కొద్ది రోజుల క్రితం కరోనా సోకడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి: