'వారం గడుస్తున్నా...పింఛను అందలేదు' వైఎస్సార్ భరోసా పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పింఛను కోసం అయిదు రోజులుగా ఎదురు చూస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు, 35వ వార్డులలో సామాజిక భద్రత పింఛన్లు ఇప్పటికీ అందలేదు. 35 వార్డులోని ఎర్రగుంటపల్లిలో 150 మంది పింఛన్దారులు ఉన్నారు. పింఛన్లు పంపిణీ చేసే సిబ్బంది ఈ నెల 1న పింఛన్దారులతో వేలిముద్ర వేయించుకున్నారు. బ్యాంకులో డబ్బులు పడలేదంటూ నాలుగు రోజులుగా తమను తిప్పుకుంటున్నారని వృద్ధులు వాపోయారు.
అధికారులు స్పందించి తమకు వెంటనే పింఛను పంపిణీ చేయాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని...మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తమ గోడును వినిపించారు. పింఛన్ల పంపిణీ జాప్యంపై మున్సిపల్ కమిషనర్ ప్రమీల స్పందించారు. సాంకేతిక కారణాల వల్ల సమస్య ఎదురై ఉండొచ్చని పరిశీలించి పింఛను సొమ్ము అందజేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి : 'భాజపాతో వైకాపా ఒప్పందం చేసుకుంది'