కారును తప్పించే క్రమంలో ఓ పాఠశాల బస్సు.. ప్రమాదం నుంచి బయటపడింది. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం ముక్తపురం వద్ద జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ధర్మవరం నుంచి వస్తోంది. మూలమలుపు సమయంలో కారు ఎదురైంది. డ్రైవర్ బస్సును ఎడమవైపుకు తిప్పాడు. అదుపుతప్పి పక్కనే ఉన్న మెకానిక్ షాపు వైపునకు దూసుకుపోయింది. చోదకుడు చాకచక్యంగా బస్సును ఆపడం.. విద్యార్థులకు అపాయాన్ని తప్పించింది.
ఇది కూడా చదవండి