ETV Bharat / state

Sanskrit instead of Telugu: మళ్లీ అదే తప్పు.. తెలుగుకు బదులు సంస్కృతం పేపర్​

Sanskrit instead of Telugu In Tenth Exam : పదవ తరగతి పరీక్షలో ఓ విద్యార్థికి ఓ ప్రశ్నాపత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం అందింది. అక్కడ ఉన్న ప్రధానోపాధ్యాయుడు ఆరా తీయగా.. నీకు ఈ ప్రశ్నాపత్రమే వచ్చిందనే సమాధానం ఇచ్చాడని విద్యార్ధి అన్నారు. తన కుమారుడి భవిష్యత్తు ఏమవుతోందని విద్యార్థి తండ్రి ఆందోళన చెందుతున్నాడు.

Sanskrit instead of Telugu In Tenth Exam

author img

By

Published : Apr 17, 2023, 5:41 PM IST

Sanskrit instead of Telugu In Tenth Exam : విద్యార్థి భవిష్యత్తుకు పదవ తరగతి పరీక్షలు పునాది లాంటివి.. అందుకని ఎంతో కష్టపడి చదవుతారు. అలానే అనంతపురం జిల్లాలో ఓ విద్యార్థి చదివిన చదువును పరీక్షల్లో రాయడానికి పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. కానీ అక్కడ ఇన్విజిలేటర్ ఇచ్చిన ప్రశ్నాపత్రాన్ని చూసి విద్యార్థి ఒక్కసారిగా షాక్​కు గురయ్యాడు. ఇంతకీ అతను షాక్ అయ్యింది తాను చదివిన ప్రశ్నలు పరీక్షలో రానందుకు కాదు.. తన పరీక్ష పేపర్​కు బదులుగా వేరే పేపర్ ఇచ్చారు ఆ విద్యార్ధికి..

రెండోసారీ అదే తప్పు.. అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో పదో తరగతి పరీక్ష రాస్తున్న అజిత్ కుమార్​కు రెండోసారి కూడా సంస్కృతం ప్రశ్నాపత్రమే సిబ్బంది అందించారు. రెండు వారాల క్రితం తెలుగు పరీక్ష రాసిన నిజవల్లి గ్రామానికి చెందిన అజిత్ కుమార్.. తెలుగు పేపర్​కు బదులు సంస్కృతం ప్రశ్నాపత్రం అందించి సంబంధిత పాఠశాల సిబ్బంది.. ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలిసిందే. కుందుర్పి మండల కేంద్రంలో పరీక్ష రాస్తున్న అజిత్ కుమార్ సోమవారం కూడా 30 మార్కులకు చెందిన సంస్కృతం ప్రశ్నాపత్రం అందించడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

పరీక్ష రాయడానికి పరీక్షా కేంద్రానికి వెళ్తే తనకు సంస్కృతం పేపర్ ఇవ్వడంతో షాక్ అయ్యాడు. మొదటి రోజు సంస్కృతం ప్రశ్నాపత్రం ఇచ్చిన రోజు పరీక్షలు చివర్లో ప్రత్యేకంగా తెలుగు పేపర్ ఇచ్చి రాయిస్తామని చెప్పిన అధికారులు.. ఈ రోజు కూడా సంస్కృతం పేపరు ఇచ్చి తన కొడుకు భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారని తండ్రి నాగరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు చేసిన తప్పుకు నా కుమారుడు ఇబ్బందులు పాలవుతున్నాడని తండ్రి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

బయటకు పొక్కకుండా.. తనకు తెలుగు ప్రశ్నాపత్రంకు బదులు సంస్కృతం భాషకు చెందిన ప్రశ్నాపత్రం రావడంతో ఆ విద్యార్థి అయోమయంలో పడ్డాడు. పరీక్ష గదిలోని ఇన్విజిలేటర్​ని అడుగగా ఆ విద్యార్థికి సంస్కృతం ప్రశ్నాపత్రమే తనకు వచ్చిందని ఆ ఇన్విజిలేటర్​ తెలిపాడు. ఈ విషయంపై అధికారులు అడగగా విద్యార్థి దరఖాస్తు చేసుకునే సమయంలో అలా చేశారని చెప్పారు. ఈ విషయం బయటకు తెెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

పదో తరగతి విద్యార్థికి తెలుగుకు బదులు సంస్కృతం.. రెండోసారీ అలానే!

"నా కొడుకు బాగా చదువుతున్నాడు.. నా కొడుకు చదువుతున్నది తెలుగే. కానీ పరీక్షకు వెళ్తే తెలుగు పేపర్ కాకుండా వేరే పేపర్ ఇచ్చి రాయించారు. అస్సలు చదవని దానిని పేపర్ ఇచ్చి రాయమంటే ఏ రకంగా రాస్తాడు. దీని గురించి అడిగితే తరువాత రాయిస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఇలా అంటున్నారు. నా కొడుకు ఏమీ రాయలేదు.. చదివితేనే కదా రాసేది. ఫెయిల్ అవుతానని బాధ పడుతున్నాడు. ఎక్కడ తప్పు జరిగిందో నాకు తెలియదు.. ఇలా చేస్తే నా కొడుకు భవిష్యత్​ ఏమవుతుంది.. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు." - నాగరాజు, విద్యార్థి తండ్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.