అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాల గ్రామంలోని ఓ పశువులపాకలో ఏకంగా 14 పాములు బయటపడ్డాయి. తన ఇంటి నిర్మాణం కోసం ఓ వ్యక్తి ఇటుకలు నిల్వ చేసుకున్నాడు. అయితే వాటిని తీసే క్రమంలో ఒక్కో పాము బయటకు వస్తుండడం ఆందోళనకు గురై స్థానికులకు సమాచారం ఇచ్చాడు. వారంతా ఇటుకలు తొలగించి చూడగా సుమారు 14 పాములు బయట పడ్డాయి. స్థానికులు వాటిని కొట్టి చంపేశారు.
ఇవీ చూడండి...