అనంతపురం జిల్లా పుట్టపర్తి చిత్రావతి నదిలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని.. రష్యన్ యువతి శుభ్రం చేయిస్తున్నారు. సత్యసాయి నడయాడిన చిత్రావతి నది చెత్తతో నిండిపోయి ఉండడాన్ని చూసి చలించిన అక్సా.. సొంత డబ్బులు వెచ్చించి 20 మంది కూలీలతో శుభ్రం చేయిస్తున్నారు. చెత్తాచెదారంతోపాటు...కలుపు మొక్కలు తొలగిస్తున్నారు. నది పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు వారం రోజులుగా కృషి చేస్తున్న అక్సాను స్థానికులు ప్రశంసిస్తున్నారు.
'నదులు మన కన్నతల్లి వంటివి. పుట్టపర్తిలో ఉన్న చిత్రావతి నది ఎంతో చారిత్రక ప్రాశస్త్యం కలిగి ఉంది. సత్యసాయి బాబా నడయాడిన ప్రదేశంలో ఉన్న ఈ నది ఎంతో పవిత్రమైనది. గంగా, యమునా, సరస్వతి వంటి పవిత్ర నదులను కలిగి ఉన్న భారత దేశంలో నదులను పరిరక్షించుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది' - అక్సా, రష్యన్ యువతి
ఇవీ చూడండి: