ETV Bharat / state

Bus Breaks fail: బస్సు బ్రేకులు ఫెయిలై.. విగ్రహాన్ని ఢీకొట్టి

author img

By

Published : Sep 26, 2021, 5:50 PM IST

గుంతకల్లు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆలూరు నుంచి గుంతకల్లుకు వస్తుండగా పట్టణ శివార్లలోని బీరప్ప కూడలి వద్ద బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న హోటల్ పైకి.. పక్కనే ఉన్న కనకదాసు విగ్రహం వైపునకు బస్సు దూసుకెళ్లింది.

Bus Breaks fail
బ్రేకులు ఫెయిలైన ఆర్టీసీ బస్సు... విరిగిన విగ్రహం

అనంతపురం జిల్లాలో గుంతకల్లు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆలూరు నుంచి గుంతకల్లుకు వస్తుండగా పట్టణ శివార్లలోని బీరప్ప కూడలి వద్ద బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న హోటల్​పైకి.. పక్కనే ఉన్న కనకదాసు విగ్రహం వైపునకు దూసుకెళ్లింది. ఆదివారం సెలవు దినం కావడంతో బస్సులో ప్రయాణికులు రద్దీ తక్కువగా ఉంది. మధ్యాహ్నం కావడంతో అక్కడ స్థానికులెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.

బస్సు దూసుకెళ్లిన ప్రదేశంలో టీ హోటల్​తో పాటు కనకదాసు విగ్రహం ఉండటంతో పాక్షికంగా ముఖ మండప నిర్మాణం దెబ్బతింది. దీంతో కురుబ సామాజిక వర్గానికి చెందిన నేతలు తమకు న్యాయం చేయాలంటూ జాతీయ రహదారిపై రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు ఉంచి ధర్నా నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అక్కడకు చేరుకున్న ఒకటవ పట్టణ పోలీసులు.. డిపో అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. బస్సు డ్రైవర్​కు అస్వస్థతగా ఉండటంతో చికిత్స కోసం స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి : AGRICULTURE: అప్పుల భారంతో.. వ్యవసాయాన్ని వదిలేస్తున్న రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.