అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఒకే రోజు 3 ఇళ్లల్లో దొంగతనాలు ప్రజలను ఆందోళనకు గురి చేశాయి. పట్టణంలోని కమటాం వీధి, బండగేరి వీధుల్లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. కమటాం వీధిలో నివాసముంటున్న రైల్వే ఉద్యోగి అరుణ్‌కుమార్ భార్య పుట్టింటికి వెళ్లగా.. ఆయన విధులకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళాలను పగలగొట్టి బీరువాలో ఉన్న 25 తులాల బంగారం, 25 తులాల వెండి, 5 వేల నగదును దోచుకెళ్లారు. ఇదే తరహాలో బండగేరి వీధిలో నివాసం ఉండే ఆటో కమలాకర్, రాము అనే వ్యక్తుల ఇంట్లోని 5 తులాల వెండి, 95 వేల నగదును దోచేశారు. ఇళ్ల యజమానులు తమ పనులు ముగించుకుని ఉదయం ఇంటికి వచ్చి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. రాత్రి సమయంలో పోలీసులు గస్తీ నిర్వహించకపోవడం వల్లే దొంగలు ఇలా ఇళ్లల్లోకి చొరబడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: