అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. బుధవారం ఉదయం తెదేపా జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఎస్కార్ట్ గా వచ్చిన అనంతపురం రిజర్వ్ పోలీసు తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం సంభవించింది. ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కారు వెనుక టైరు పేలడంతో ప్రమాదం జరిగింది.
ఇదీ చూడండి సీఎం నివాసానికి భారీగా అర్జీదారులు.. తీవ్ర ఇక్కట్లు!