అనంతపురం జిల్లా పెనుకొండలో 44వ నంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటంపల్లి గ్రామానికి చెందిన రైతులు తమ పొలంలో పండించిన దోసకాయలను విక్రయించడానికి బెంగళూరుకు బొలెరో వాహనంలో తరలిస్తుండగా హరిపురం వద్ద వాహనం టైరు పేలి బొలెరో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఇదీ చదవండి.