అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి చెందిన సుజాతమ్మ పరిస్థితిని చూసి 'ఈటీవీ ఆంధ్రప్రదేశ్', 'ఈటీవీ భారత్'లో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. తన మనవడు (కూతురి కొడుకు) పుట్టుకతోనే దివ్యాంగుడు కావటం.. కూతురు, అల్లుడు మరణించటంతో ఆమె జీవితం చతికిలపడిపోయింది. అంతే కాక సుజాతమ్మకు క్యాన్సర్ రావడంతో మనవడిని కాపాడుకోవాలో, తాను చికిత్స తీసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు అప్పు చేసింది.
ఇలాంటి దయనీయ పరిస్థితిని చూసిన 'ఈటీవీ ఆంధ్రప్రదేశ్', 'ఈటీవీ భారత్' ఆమెపై కథనాన్ని ప్రసారం చేశారు. ఇది చూసిన పలువురు ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. విజయవాడకు చెందిన నాగరాజు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా 'ఈటీవీ'లో కథనం చూసి 50వేలు ఆమె వ్యక్తిగత ఖాతాలో వేశారు. అలాగే ఆపద్భాంధవ స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుజాతమ్మ ఇంటికి సరిపడా సరుకులు ఇస్తూ భవిష్యత్ లో ఏ సహాయం కావాలన్న ఆమెకు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండీ...అమ్మమ్మ కష్టం : క్యాన్సర్తో పోరాటం... మనవడిని బతికించుకోవాలని ఆరాటం