ఆర్డీటీ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని.. నిరాశ్రయులైన వారిని ఆదుకోవడమే తమ లక్ష్యమని సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ మ్యాంచు ఫెర్రర్ తెలిపారు. తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా లక్ష మాస్కులు కుట్టించి అనంతపురం జిల్లా ఉరవకొండలో ప్రజలకు పంపిణీ చేస్తున్నామన్నారు.
కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో మాస్కుల అవసరం ఎంతైనా ఉందన్నారు. 69 గ్రామాల్లో 27 సెంటర్లు ఏర్పాటుచేసి శిక్షణ తీసుకున్న మహిళల ద్వారా మాస్కులు కుట్టిస్తున్నామన్నారు. అనంతరం ఉరవకొండలో విలేకర్లకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
ఇవీ చదవండి.. 2 రోజుల్లోనే సరకు ఖాళీ.. కనిపించని జనం